దేశంలో ఏ ముహూర్తంలో కరోనా వైరస్ వ్యాప్తించిందో కానీ.. ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది.  వాణిజ్య వ్యవస్థ గురించి చెప్పలేని పరిస్థితి నెలకొంది.  వ్యాపారలు చేసుకునే వారు అష్ట కష్టాలు పడుతున్నారు.  ఇక వినియోగ దారుల గురించి చెప్పే పరిస్థితి లేదు.. ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అయిన ఇప్పటి నుంచే భయపడి పోతున్నారు.  మొన్నటి వరకు కరోనా వైరస్ మాంసం విక్రయదారులకు నిద్ర పట్టకుండా చేసిన విషయం తెసిందే.

 

చికెన్ , మటన్ తింటే కరోనా వస్తుందని పుకార్లు వచ్చాయి.. దాంతో ఈ వ్యాపారాలు మొత్త కుంటు పడ్డాయి. తాజాగా క‌రోనా పై పోరులో భాగంగా 3 వారాలు సుదీర్ఘంగా లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో మ‌త్స్య‌కారుల‌కు గ‌డ్డు కాలం ఏర్ప‌డింది.  తీర ప్రాంతంలో ప‌ట్టిన చేప‌లు మార్కెట్ లో అమ్మాలంటే కోల్డ్ స్టోరేజీ త‌ప్ప‌నిస‌త‌రి. వివిధ ప‌రిశ్ర‌మల‌కు చేప‌లు స‌ర‌ఫ‌రా చేద్దామ‌న్నా..లాక్ డౌన్ అక్క‌డే కార్మికులంతా ఇళ్ల‌లోకి వెళ్లిన ప‌రిస్థితి. 

 

ప‌రిస్థితుల నేప‌థ్యంలో చేప‌ల‌ను పార‌పోయ‌డం త‌ప్ప మ‌త్య్స‌కారుల‌కు వేరే మార్గాలేవి కనిపంచ‌లేదు. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 15 వేల ట‌న్నుల చేప‌లు వృథాగా ప‌డేశారంటే మ‌త్స్య‌కారుల ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చేప‌ల విలువ మార్కెట్ లో రూ.200 కోట్లు ఉంటుంద‌ని కరంగా ఫిషింగ్ కో ఆప‌రేటివ్ సొసైటీ స‌భ్యుడు గ‌ణేశ్ న‌ఖావా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: