చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ప్రధానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ప్రజలకు ఎలా ఆహారం కల్పించాలి, ఆకలి కేకలు లేకుండా ఎలా వ్యవహరించాలి అని విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో చైనా మాత్రం ఇతర దేశస్థులు ఆర్థిక వ్యవస్థపై కన్నేసింది. ఏ ఏ దేశాలలో పెట్టుబడులు పెట్టవచ్చు, ఆయా దేశాల కంపెనీల ను ఎలా కైవసం చేసుకోవాలి, వాటిలో ఎలా పాగా వేయాలి, కుదిరినప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ కొట్టాలి వంటి ఆలోచనలతో ముందుకు సాగుతోంది. దీంతో చైనా దేశాల కుట్రలను పసిగట్టిన యూరప్ దేశాలు అయినా ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు చైనా పెట్టుబడులపై పరిమితులు విధించాయి.

 

డ్రాగన్ కంట్రీ పెట్టుబడిదారులు తమ దేశంలోకి రాకుండా ప్రత్యక్ష, పరోక్ష, విదేశీ పెట్టుబడులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో చైనాకి ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. యూరప్ దేశాలలో తన ఎత్తులు నెరవేరక పోవడంతో తాజాగా ఇండియా పై కన్నేసింది డ్రాగన్ కంట్రీ. దేశంలోని బడా బడా కంపెనీల లో పెట్టుబడులు పెట్టాలని భావించింది. దీనికోసం  పక్కా స్కెచ్ నీ రూపొందించదట. ఈ ప్లాన్ ని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఆగమేఘాల మీద పలు కీలక జీవోలను రిలీజ్ చేసింది మోడీ సర్కార్. చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించేది లేదని తెగేసి చెప్పింది. ఇప్పటిదాకా చైనా దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే.. ఆటోమేటిక్ రూట్ ద్వారా అంటే ఆర్బిఐ అనుమతుల ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.

 

కానీ ఈ నియమ నిబంధనలను సడలించింది. తాజాగా చైనా దేశస్తులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అంటే క్యాబినెట్ స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. చైనా ప్లాన్ ఏంటంటే ఇండియా ని ఆర్థికంగా దెబ్బ కొట్టడం. ఈ ప్లాన్ ని ముందుగా పసిగట్టడం తో వెంటనే రియాక్ట్ అయ్యింది మోడీ సర్కార్. దీంతో చైనా.. ఇండియా లో పెట్టుబడులు పెట్టాలంటే...ఇక నుండి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని సరికొత్త జీవో మోడీ సర్కార్ ఇవ్వటంతో చైనా ప్రధాని జిన్ పింగ్ నివ్వెరపోయినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: