పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొదట్లో రాజకీయంగా మంచి ఊపు కనపరిచినా, 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా పవన్ ఉన్నారు. ఆ సమయంలో బిజెపి టిడిపి కూటమికి మద్దతు పలకడమే కాకుండా 2019 ఎన్నికల బరిలోకి దిగి ఒకే ఒక్క సీటు గెలుచుకుని ఘోరంగా ఓటమి చెందారు. ఇక ఆ తర్వాత రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపితో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఇక బిజెపి కూడా మొదట్లో పవన్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నాయకులను సైతం తరచుగా కలవడం, ఏపీ రాజకీయ విషయాల గురించి చర్చించడం, ఇలా హడావుడిగా పవన్ వ్యవహారం ఉండేది. అయితే క్రమక్రమంగా పవన్ కు బిజెపి ప్రాధాన్యం తగ్గించడం, అసలు ఏ వ్యవహారంలోనూ పవన్ తో సంప్రదింపులు చేయకపోవడం వంటి కారణాలతో బీజేపీపై పవన్ ఆగ్రహంగా ఉన్నారు. 

 

IHG's SENSATIONAL meeting with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MODI' target='_blank' title='modi- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>modi</a> ? | TeluguBulletin.com

 

ప్రస్తుతం కరోనా వ్యవహారంతో దేశమంతా అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల అధినేతలతోనూ మోదీ సంప్రదింపులు చేస్తున్నారు. కరోనా విషయంలో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అయితే బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన ను ఎవరూ పట్టించుకోకపోవడంపై పవన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు బిజెపి, జనసేన మిత్రపక్షంగా ఉందన్న విషయాన్ని కూడా బిజెపి నాయకులు ఎవరూ గుర్తుంచుకోవడం లేదు అనే బాధ పవన్ లో ఎక్కువగా కనిపిస్తోంది.

 

 ఇక ఏపీ బిజెపిలో మూడు గ్రూపులు ఉండడంతో ఎవరికివారు సొంతంగా రాజకీయాలు చేసుకుంటున్నారు తప్ప పవన్ కలుపుకుని వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం పవన్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉన్న సమయంలో పవన్ కు ఎక్కడలేని ప్రాధాన్యం దక్కేది. ప్రతి విషయంలోనూ పవన్ తో సంప్రదింపులు చేయడమే కాకుండా, గౌరవ మర్యాద లకు ఎటువంటి ఢోకా లేకుండా ఉండేది. కానీ ప్రస్తుతం బిజెపిలో అటువంటి వ్యవహారాలు ఏవీ లేకపోవడం, అసలు మిత్రపక్షంగా జనసేన ను గుర్తించకపోవడంపై తీవ్ర ఆగ్రహంగా పవన్ ఉన్నారట. త్వరలోనే బీజేపీతో పొత్తు విషయమై కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: