ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెడుతున్న పథకాలు చరిత్ర సృష్టిస్తుంది . అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అనుసరిస్తున్న కొన్ని ప్రణాళికలను ఐఏఎస్  లకు ట్రైనింగ్ పాఠ్యాంశాలుగా ఉపయోగిస్తున్నారు అన్నది తాజాగా వెలువడిన అటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన గ్రామ సచివాలయ వ్యవస్థ తో పాటు
.. వాలంటీర్లు వ్యవస్థ పనితీరును ఐఏఎస్  లకు ట్రైనింగ్ అవుతున్నటువంటి వారికి  పాఠ్యాంశాల రూపంలో చెబుతున్నారు. 

 

 ఇలా తమకు జగన్ ప్రణాళికలను పాఠ్యాంశాల రూపంలో చెబుతున్నారు అని ట్రైనీ  ఐఏఎస్లు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన  తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశాన్ని  వైసిపి పార్టీ ఎక్కువగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. వాస్తవంగా అయితే ఐఏఎస్లు ఐపిఎస్ లు  ఆ తర్వాత పని చేసేది ప్రజల్లోనే కాబట్టి ఇలాంటి పాఠ్యాంశాలు ఉపయోగపడతాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో జగన్ సర్కార్ పై కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.జగన్  ప్రణాళికలను ట్రైనీ ఐఏఎస్లకు పాఠ్యాంశాలుగా చెబుతున్నప్పటికీ దానిని పబ్లిసిటీ చేసుకోవడం మాత్రం మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు. 

 


 గతంలో చంద్రబాబు హయాంలో పలు పథకాల గురించి ట్రైనీ ఐఏఎస్లకు పాఠ్యాంశాలుగా వివరిస్తే.. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన  జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము కూడా అదేరీతిలో నడుస్తాము అన్నది సరైనది కాదు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవే  అయినప్పటికీ... దీనికి సంబంధించి ఓవర్గా ప్రచారం చేయడం మాత్రం మంచిది కాదు అంటున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుంది అన్నది  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: