తెలుగుదేశం పార్టీ మహానాడు భారీ ఎత్తున చేపడదామని చూసినా, లాక్ డౌన్ నిబంధనల కారణంగా తూతూ మంత్రంగానే కానిచ్చేశారు. మహానాడులో మొత్తం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పరిపాలన గురించి, ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టడం గురించి విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులంతా ఈ విధంగానే ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా మహానాడులో తెలంగాణ  విషయాల పైన చర్చ జరిగింది. అయితే జగన్ పై దూకుడుగా విమర్శలు చేసిన అంత స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేసినందుకు చంద్రబాబు  సాహసించలేకపోయారు.మొహమాట పడుతూ విమర్శలు చేశారు. కానీ పార్టీ నాయకులతో మాత్రం ఘాటుగానే విమర్శలు చేయించారు. 

 

IHG' from <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELANGANA' target='_blank' title='telangana-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telangana</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POLITICS' target='_blank' title='politics-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>politics</a>, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a> tells Andhra <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CM' target='_blank' title='cm-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cm</a> Chandrababu ...


తెలంగాణ వ్యవసాయ రంగం అనే అంశంపై చేసిన తీర్మానంపై మాట్లాడిన బాబు, ధాన్యం సేకరణలో గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులనూ ఆదుకోవాలన్నారు. రైతు బంధు ఇంకా ఎవరికైనా అందకపోతే గుర్తించి వెంటనే ఇవ్వాలంటూ కెసిఆర్ కు సూచించారు. కెసిఆర్ అంటే భయం కారణంగా చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యానించినా,  తెలంగాణ టిడిపి నాయకులు మాత్రం ఓ రేంజ్లో కెసిఆర్ పై విమర్శలు చేశారు.కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయం మర్చిపోయారు అంటూ కొత్తకోట దయాకర్ రెడ్డి విమర్శలు చేయగా, ప్రజల్లో ఉన్న ఉద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు కెసిఆర్ జగన్ తో కలిసి నాటకాలు ఆడుతున్నారు అంటూ మరో నాయకుడు విమర్శించారు.

 

 అలాగే జిల్లాల వారీగా విభేదాలు సృష్టించేందుకు కేసీఆర్ కొత్తగా జగన్ వాదనను తెరపైకి తెచ్చారని మరో నాయకుడు వ్యాఖ్యానించారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మద్యం అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉండగా, అక్షరాస్యత లో మాత్రం చివరి స్థానంలో ఉందని మరో నాయకుడు విమర్శించారు. ఇక చివరిగా మాట్లాడిన చంద్రబాబు గచ్చిబౌలి మైదానాన్ని ఆసుపత్రి గా మార్చడం అభినందనీయం అంటూ కేసీఆర్ ను మెచ్చుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: