తెలుగుదేశం పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మహానాడులో పార్టీ జంపింగ్ కార్యక్రమాలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు రాగా మొన్నటి వరకు అటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు. అయితే తాజాగా ఇటీవల ప్రకాశం జిల్లా వేదికగా ఒక్కసారిగా టీడీపీ పార్టీ నాయకులు వైసీపీ లోకి జాయిన్ అవుతున్న తరుణంలో ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఆయన కుమారుడు సుధీర్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శిద్ధా రాఘవరావు రాకతో వైసీపీ పార్టీ ప్రకాశం జిల్లాలో మరింత బలపడింది అని చాలామంది అంటున్నారు.

 

2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హవా బలంగా ఉన్న నేపథ్యంలో శిద్ధా రాఘవరావు పార్టీలోకి రావటంతో ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ముందుగా కరణం బలరాం ఆ తర్వాత ఎమ్మెల్సీ పోతుల సునీత తాజాగా శిద్ధా రాఘవరావు ఇలా వరుస పెట్టి నేతలు వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి బలం చేకూరినట్లు అయింది. ఇదిలా ఉండగా పార్టీలోకి వచ్చి 24 గంటలు గడవకముందే శిద్ధా రాఘవరావు పార్టీ తరఫున జిల్లాలో తనకంటూ ఓ పదవి కేటాయించాలని పార్టీ హైకమాండ్ ని అడిగినట్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఇదే తరుణంలో శిద్ధా టీడీపీ పార్టీని వీడటం పట్ల చంద్రబాబు పిరికితనం రాజకీయ ఆరోపణలు శిద్ధా రాఘవరావు పై చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: