ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కులం తో పాటు మీడియా కూడా శాసిస్తాయి అని అందరికి తెలుసు. అందువల్లే అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ సమావేశాలలో చాలావరకు మీడియాల ప్రస్తావన నాయకుల మధ్య వస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా కులం యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి సామాన్యుడిని ప్రభావితం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా రెండు అగ్రకులాల ఆధిపత్య పోరు మధ్య ఏపీ రాజకీయం అటు ఇటు గా నడుస్తుంటుంది. అయితే ఇటీవల టెక్నాలజీ పెరగటంతో మీడియా ప్రభావం తగ్గి సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. దీంతో గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పై సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు మరియు నాయకులు తీవ్ర స్థాయిలో చంద్రబాబు హయాంలో జరిగిన ప్రతి అవినీతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పొలిటికల్ గా జగన్ కి మంచి సపోర్ట్ ఇచ్చారు.

 

మ్యాగ్జిమం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా ఎక్కువ టిడిపి చేతుల్లో ఉంటుందని అందరికీ తెలుసు. దీంతో అర చేతిలో ఉండే టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటంతో వైసిపి పార్టీకి చెందిన క్యాడర్ గత ఎన్నికల టైంలో ఎక్కువగా జగన్ కార్యక్రమాలను పాదయాత్రను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం జరిగింది. దీంతో బాగా వర్క్ అవుట్ అవ్వడం తో వైస్సార్సీపీ అధికారం లోకి రావడం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోషల్ మీడియాలో వైసిపి పార్టీ కి చెందిన వాళ్ళు యాక్టివ్ గానే ఉంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడా తగ్గడం లేదు. సోషల్ మీడియా సాక్షిగా టీడీపీ  వైసీపీ మధ్య మంచి యుద్ధం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. 

 

టీడీపీ పార్టీకి చెందిన వాళ్లు వైసీపీ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని పేటిఎం బ్యాచ్ అనే ఒక పేరుతో విమర్శిస్తుంటారు. ఇదిలా ఉండగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం పై నారా లోకేష్ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు ఎప్పటికప్పుడు వైసిపి పేటీఎం బ్యాచ్ కి అదిరిపోయే విధంగా ప్రతిదానికి కౌంటర్ వేయాలని తాజాగా కియా కొత్త కారు విషయంలో ఈ విధంగానే వ్యవహరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు హయాంలో కియా కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ టిడిపి జెండా రంగు పసుపురంగు కారులో ఒక కారు రిలీజ్ చేయడంతో… ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని వైసిపి సోషల్ మీడియా ని ఏకిపారేస్తోంది టీడీపి సోషల్ మీడియా.  

మరింత సమాచారం తెలుసుకోండి: