ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది ఈ మహమ్మారి. రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతుండటంతో రోగులకు హాస్పిటల్లో సదుపాయాలు కూడా సరిగ్గ అందడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కరోనా వైరస్ సోకిన వారందరికీ హాస్పిటల్ లో బెడ్ కేటాయించి చికిత్స అందించగా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి అంటు సూచిస్తుంది,
ప్రస్తుతం భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. హాస్పిటల్లో సామర్థ్యానికి మించి కరోనా రోగులు ఉండగా... కొత్తగా కరోనా బారిన పడిన పేషెంట్లకు సరిపడా సరైన వసతులు లేకుండా పోతున్నాయి. ఇదే సమయంలో అసెంప్టామాటిక్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి భారతదేశంలో. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ దేశాల్లో అమలు చేస్తున్నట్లు గానే కరోనా లక్షణాలు తక్కువ ఉన్నవాళ్లు ఐసోలేషన్ వార్డులో కాకుండా ఇంట్లోనే ఐసొలేట్ కావాలి అని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తోందట . అతి తక్కువ కరోనా లక్షణాలు ఉన్న వారం రోజులు... ఎక్కువ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు వారానికి పైగా ఐసోలేషన్ లో ఉండాలని సూచిస్తున్నారట వైద్యులు.
ఎక్కువ కరోనా లక్షణాలు ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు మాత్రమే హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాలి అంటూ చెబుతున్నారట. మొన్నటి వరకు హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకోగ.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రోజురోజుకు కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో రాబోయే రోజుల్లో మరింత దయనీయ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. ఏదేమైనా రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోతుండటంతో అటు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. ఏ క్షణాన కరోనా ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతో బతుకుతూ ఉన్నారు అందరూ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి