ఇక్కడ అనుమానం ఓ దారుణం ఘటనకు దారి తీసింది. అనుమానం సంసారంలో చిచ్చు పెట్టింది. అనుమానంతో ఓ భర్త అతి దారుణంగా భార్యను చంపిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నం మండలం లోని కొత్తకోటకు చెందిన జయరామ్ లలిత దంపతులు తోటలో పనిచేసేందుకు మూడు రోజుల క్రితం తుంపర్తి కి వచ్చారు. లలిత తల్లిదండ్రులు గంగాద్రి కేశమ్మలు ఇదే తోటలో గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయితే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో లలిత పై భర్త అనుమానం పెంచుకున్నాడు.
ఇక అక్రమ సంబంధాలు అంటగట్టి భార్యను వేధించడం మొదలు పెట్టాడు భర్త. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి, ఇటీవలే తోట లో పనిచేస్తున్న సమయంలో భార్యభర్తలిద్దరు మద్య గొడవ జరిగి మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త జయరామ్ పక్కనే ఉన్న రోకలిబండతో భార్య తలపై విచక్షణ రహితంగా కొట్టడం తో తీవ్ర రక్తస్రావమైంది లలిత అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది, లలిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితుడు జయరామ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి