దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సోనియా భావిస్తున్నారు. లేకపోతే అధికార బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమయ్యే పనికాదనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తున్న క్రమంలో, బలం పెంచుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై సోనియా గాంధీకి కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు ఘాటుగా లేఖ రాయడం పెద్ద సంచలనమే సృష్టించింది.

లేఖ ద్వారా కాంగ్రెస్ నాయకుల్లో ఎంత ఆందోళన ఉంది, ఎంతగా తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు ? కాంగ్రెస్ పని ఇక అయిపొయింది అనే అభిప్రాయానికి వారు వచ్చేసారు అని ఇలా అనేక విశ్లేషణలు మొదలయ్యాయి.అంతే కాదు కాంగ్రెస్ అధినాయకత్వానికి కూడా వస్తాం ఏంటి అనేది తెలిసొచ్చింది. ఇది ఇలా ఉంటే.. ఈ లేఖ రాసిన వారిలో గులాం నబీ ఆజాద్ తో పాటు, మరి కొంత మంది కీలక నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు, సంస్థాగతంగా ప్రక్షాళన అవసరం అంటూ 23 మంది సీనియర్లు సోనియాగాంధీకి కొద్ది రోజుల క్రితం లేఖరాశారు.

 ఈ వ్యవహారం అప్పట్లో సద్దుమణిగి పోయినట్టుగా కనిపించగా, ఆ లేఖ రాస్తూ సంచలనం సృష్టించిన గులాంనబీ ఆజాద్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులను కీలక పదవి నుంచి సోనియా తప్పిస్తూ నిర్ణయం  తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళన లో భాగంగానే ఈ నిర్ణయం వెలువడినట్టుగా ఏఐసిసి వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా కొనసాగిన గులాంనబీ అజాద్, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ ఓరా, జిన్హో ఫలేరియో, అంబికా సోనీ లను పదవి నుంచి తప్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

 కాకపోతే గులాం నబీ ఆజాద్ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు అన్ని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ముందు ముందు పార్టీని గాడినపెట్టి పార్టీలో పునర్వైభవం తీసుకొచ్చేందుకు సోనియా కఠిన  నిర్ణయాలు తీసుకునే విధంగానే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: