కరోనా కట్టడికి ఇప్పటివరకు వ్యాక్సిన్ రాలేదు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. రష్యాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా...దానిపై అనుమానాలు ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాల్లో ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. దీంతో కరోనా రోగులకు... అందుబాటులో ఉన్న డ్రగ్స్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో రెమెడిసివర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినావిర్, ఇంటర్ ఫెరాన్ల కాంబినేషన్లను ఉపయోగిస్తున్నారు.
అయితే... ఇవన్నీ పనికిరావని తేల్చేసింది ప్రపంచ ఆరోగ్యసంస్థ. కరోనా ట్రీట్‌మెంట్ కోసం ఉపయోగిస్తున్న రెమెడిసివర్ ఎలాంటి ప్రభావం చూపట్లేదని సంచలన ప్రకటన చేసింది. రెమెడిసివర్ వల్లే రోగులు కోలుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పింది. కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించిన మొట్ట మొదటి యాంటీవైరల్ డ్రగ్ రెమెడిసివర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా చికిత్సలో కూడా దీన్నే ఉపయోగించారు. ఈ డ్రగ్స్‌నే దివ్య ఔషధాలుగా భావిస్తున్న సమయంలో... డబ్ల్యూహెచ్‌వో చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది.
ఈ నాలుగు డ్రగ్స్ పనితీరు, వాటి ప్రభావంపై సాలిడారిటీ ట్రయల్ నిర్వహించింది. కోవిడ్ రోగులకు ఇచ్చే 28 రోజుల కోర్సులో ఇవి ఎలాంటి ప్రభావం చూపలేదని తెల్పింది. ఐతే అమెరికా.. గిలియడ్, రెమెడిసివర్‌పై కొన్నిరోజుల కిందటే ప్రయోగాలు నిర్వహించింది. ప్లాసిబో తీసుకునే వారితో పోలీస్తే ఈ ఔషధం తీసుకున్న కోవిడ్ రోగులు త్వరగా కోలుకున్నట్లు తేలింది. వెయ్యి 62 మందిపై పరీక్షలు నిర్వహించారు. రెండు సర్వేల్లో వేర్వేరు ఫలితాలు రావడం...మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.
డబ్ల్యూహెచ్‌వో సాలిడారిటీ ట్రయల్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ డేటా అస్థిరంగా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్... జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినావిర్ పనికిరానివని తేలిందని వివరించారు. దీంతో వాటిని నిలిపివేశామన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి