డాక్టర్. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు మృతి చెందడంతో దుబ్బాక లో ఉప ఎన్నిక వచ్చింది . ఆ స్థానానికి ఎందరో ఆశావాహులు ఎదురు చూశారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం సోలిపేట రామలింగారెడ్డి గారి భార్య సుజాత గారికి టికెట్ ఇచ్చారు.
టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు .

హరీష్ రావు గారు జిల్లా మంత్రిగా తానే అన్నిటికీ ముందు నిలబడి నడిపిస్తున్నారు . ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి కి సంబంధించిన ముఖ్యమైన నాయకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.
 బిజెపి అభ్యర్థి అయిన రఘునందన్ రావు కి సంబంధించిన 40 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి ఇందులో అధికార పార్టీకి సంబంధించిన హస్తం ఉందని బిజెపి నాయకులు ఆరోపించారు . పోలీసులు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్ , బిజెపి వారు ఆరోపిస్తున్నారు.

 ఇదిలా ఉంటే వానలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం బయటికి కూడా రాలేదు ప్రగతి భవన్ చుట్టుపక్కన ఉన్న ఏరియాలు నీటమునిగిన కన్నెత్తి చూడలేదు .కానీ దుబ్బాక ఉపఎన్నిక గురించి మాత్రం మంత్రి హరీష్ రావు కి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. కెసిఆర్ కూడా హరీష్ రావు మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, హరీష్ ఎక్కడ ప్రచారం చేసినా విజయం ఖాయమని భావిస్తున్నారు.

దసరా తర్వాత దుబ్బాక లో ప్రచారం చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు . బై ఎలక్షన్ లో గెలిస్తే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టొచ్చని తమకు ప్రజాబలం ఉంది కాబట్టే గెలిచామని చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.

వరదలు ,కరోనా ,ఎల్ఆర్ఎస్ ఇలాంటివన్నీ ఆ ఉపఎన్నిక  విజయంతో  కొట్టుకుపోతాయని వారు భావిస్తున్నారు . ఇంకా ప్రజల మద్దతు తమకి మాత్రమే ఉందని గ్రేటర్ ఎన్నికలలో ప్రచారం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు.

 ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో కెసిఆర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: