చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ అతి తక్కువ కాలంలోనే పార్టీ లో ముఖ్య నాయకురాలిగా ఎదిగింది.. ఆమెకు చిలకలూరి పేట నుంచి టికెట్ రావడం పెద్ద ఆశ్చర్యమనుకుంటే ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని డిమాండ్ రావడం సంచలనం అవుతుంది.. పార్టీ కోసం రోజా లాంటి వాళ్ళు ఎంతో పనిచేశారు.. వాళ్ళను కాదని ఈమెకు పదవి ఇస్తే ఉరుకోము అని కొందరు అంటున్నారు.. ఇక విడదల రజినీ పై మొదటినుంచి చాలా వివాదాలు వస్తున్నాయి.. వివాదానికి కేంద్రంగా మారారని పార్టీ లోని నేతలే అంటున్నారు. ఇప్పటికే కొన్ని సార్లు ఆమె పంచాయితీ జగన్ వద్దకు చేరింది..

నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు కు, విడదల రజిని కి అసలు పడదు.. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వీరి మధ్య పోలీసులు నలిగిపోతూ ట్రాన్స్ఫర్ లు కూడా అయ్యారు.. అయితే ఇంకొన్ని ఫిర్యాదులు కూడా ఆమెపై జగన్ వద్దకు చేరాయి.. అయినా ఆమెను కనీసం మందలించలేదు జగన్.. దాంతో ఆమెకు ఎవరో పెద్ద తలకాయ హ్యాండ్ ఉందని తెలియకనే తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఆమెకు వైసీపీలోని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి స‌హాయం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది.

వాస్తవానికి రాజ‌కీయాలు కొత్త. తొలుత టీడీపీలో చేరాల‌ని అనుకుని.. అక్కడ స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌క‌పోవ‌డంతో వైసీపీలోకి వ‌చ్చారు. ఈ విషయంలో స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి స‌హాయం చేశారట..అంతేకాదు చిల‌క‌లూరిపేట సీటు రేసులో ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను బుజ్జగించి.. ర‌జ‌నీకి ఛాన్స్ ఇవ్వడంలో స‌జ్జల చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆమె పేరు బాగా వినిపించింది. దీనిపై క‌నీసం విచార‌ణ అయినా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఒక్క ర‌జ‌నీ విష‌యంలోనే సాధ్యమైంద‌ని.. దీని వెనుక బ‌లమైన లాబీయింగ్ ఉంద‌నడంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ రాజ‌కీయాల్లో షాడో హోం మినిస్ట‌ర్గా వ్యవ‌హ‌రిస్తోన్న వ్యక్తే విడదల రజనీకి ఫుల్‌గా కోప‌రేట్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లాలో త‌ల‌పండిన సీనియ‌ర్ నేత‌ల‌కు సైతం సాధ్యం కాని విధంగా ఆమె రాజ‌కీయం ఉంద‌ని అంటున్నారు. ఆ షాడో మినిస్టర్ స‌పోర్ట్ లేనిదే ఇదంతా సాధ్యం కాద‌నే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: