ప్రస్తుత ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోయినట్టు గా కనిపిస్తున్నాయి. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు..? ఎవరు ఎవరికి శత్రువు ? ఎవరు మిత్రుడు అనే విషయం స్పష్టంగా తెలియడంలేదు. కేంద్ర అధికార పార్టీ బిజెపి వైసిపి తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, మొన్నటి వరకు వైసీపీ పై విమర్శలు చేసిన బిజెపి నేతలు సైలెంట్ అయిపోయారు.మళ్లీ ఇప్పుడు వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు మొదలుపెట్టినట్లు గా కనిపిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము విమర్శలు చేశారు. తాజాగా వీర్రాజు పర్చూవల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పంట నష్టం, కేంద్ర వ్యవసాయ మంత్రి పురుషోత్తం కు వివరించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన వీర్రాజు జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 




రాష్ట్రంలో వరద నివారణ, సమస్యలను, నష్టాలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కనీసం తక్షణ పరిహారం కూడా ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి తో వరదల గురించి చర్చించారని, అయినా జగన్ పెద్దగా స్పందించలేదు అంటూ వీర్రాజు విమర్శించారు. భారీ వర్షాల దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు బిజెపి నాలుగు బృందాలుగా వరద పీడిత ఈ ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర తీవ్రతను అంచనా వేశాయి. ఈ బృందంలో జాతీయ బీజేపీ కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


 ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో వరద నష్టం విషయమై ఏపీ సీఎం జగన్ కేంద్రానికి అన్ని వివరాలతో లేఖ రాశారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద నిధులు కూడా మంజూరు చేయాలని కోరారు. అయినా ఇప్పుడు బిజెపి ఈ విధంగా చేరు విమర్శలు చేయడం వెనుక రాజకీయం ఏమైనా ఉందా ? అనే విషయాన్ని వైసీపీ నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఏపీ బిజెపి నేతలు పనిగట్టుకుని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంటే, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం సానుకూలంగానే ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. దీంతో బిజెపి డబుల్ గేమ్ పాలిటిక్స్ కి పాల్పడుతోందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: