ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా మత రాజ్య స్థాపనే  లక్ష్యంగా ఎన్నో వ్యూహాలు  అమలు చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలలో ఆధిపత్యం సంపాదించడానికి ఓవైపు పాకిస్తాన్ మరోవైపు టర్కీ దేశాల కూడా నీచాతి నీచమైన వ్యూహాలను కూడా అమలు చేస్తూ ఉంటాయి. సాధారణంగా అయితే పాకిస్తాన్ సౌదీ అరేబియా ఇచ్చే సహాయం పైన నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇటీవల సౌదీ అరేబియా పై ఆధిపత్యం సాధించేందుకు వార్నింగ్ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సౌదీ అరేబియా పాకిస్తాన్ తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకోవడమే కాదు ఏకంగా అప్పులు  కూడా తిరిగి చెల్లించాలి అని పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.



 అటు టర్కీ  కూడా ఇస్లామిక్ దేశాలకు పెద్దగా ఉన్న సౌదీ అరేబియాపై  ప్రస్తుతం ఆధిపత్యం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మత రాజ్య స్థాపన కాంక్ష తో రగిలి పోతున్న ఇస్లామిక్ దేశమైన టర్కీకి సౌదీ అరేబియా భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. టర్కీ కీ  సంబంధించిన అన్ని వస్తువులను సౌదీఅరేబియాలో దిగుమతులను నిలిపివేస్తూ భారీ షాక్ ఇచ్చింది. అదే సమయంలో అటు పాకిస్థాన్ కీ  కూడా బ్రేక్ వేసింది సౌదీ అరేబియా.



 పాకిస్తాన్ కు సంబంధించిన అన్ని బంధాలను తెంచుకోవడం తో పాటు అయిల్ ఎగుమతులు కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా  ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఏటీఎఫ్ దగ్గర కూడా పాకిస్థాన్కు మద్దతు తెలపకుండా భారీ షాక్ ఇస్తూ పాకిస్థాన్ కి బ్రేక్ వేసింది సౌదీ అరేబియా. ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్ ముందు గ్రే లిస్టులో ఉన్న పాకిస్థాన్ లో బ్లాక్ లిస్టులో చేర్చాలని ఇటీవలే ఎఫ్ఏటీఎఫ్ భావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ను  బ్లాక్ లిస్టులో   చేర్చకుండా ఉండేందుకు మూడు దేశాల మద్దతు  అవసరమైంది. అయితే టర్కీ  మలేషియా చైనా దేశాలు పాకిస్తాన్ కు మద్దతు తెలపడంతో బ్లాక్ లిస్టులో చేరలేదు పాకిస్తాన్. కానీ  ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా మద్దతు తెలపక పోవడంతో పాకిస్థాన్ కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: