భారత దేశ ప్రధానులలో మోడీది చాలా ప్రత్యేకమైన అంకం అనే చెప్పాలి. మునిపెన్నడూ లేని విధంగా దేశం చాలా దౌర్భాగ్యాన్ని చూసింది నేడు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభం వలన దేశం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి పోయింది. ఇలాంటి తరుణంలో కూడా మోడీ తన చాకచక్యముతో దేశాన్ని నిలబెట్టారు. లాక్ డౌన్ సమయంలో మోడీ చేసిన సేవలు దేశానికే తలమానికం. అనేక కార్యక్రమాలు చేపట్టి దేశ దారిద్ర్యాన్ని తరిమేయడంలో మోడీ కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలో అనేక సంక్షేమ పధకాలు ప్రజలకు చేరువ చేసారు మోడీ. కాగా.. రేపు వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేయనున్నట్లు సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నవనీత్ సెహగల్ ప్రకటించారు. పీఎం స్వనిధి స్కీమ్ (ఆత్మనిర్భర్ నిధి యోజన) క్రింద దాదాపు 3 లక్షల మంది వీథి వ్యాపారులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రుణాలు పంపిణీ చేస్తారని ఓ మీడియా వేదికగా ఆయన తెలపడం జరిగింది.

ఈ పీఎం స్వనిధి పథకం క్రింద వీథి వ్యాపారులు రాయితీ వడ్డీపై రూ.10,000 వరకు వర్కింగ్ కేపిటల్‌ను పొందవచ్చు అని తెలుస్తోంది. పేదవారైన వీధి వ్యాపారుల ఉద్ధరణే ధ్యేయంగా వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 1న ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. కాగా.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్నవారి జీవనోపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు ఈ రుణ సదుపాయం కేంద్రం కల్పిస్తున్నది.

కాగా.. ఇప్పటి వరకు సుమారు 24 లక్షల మందికి పైగా ఈ రుణాల కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. అయితే వీరిలో దాదాపుగా అర్హులైన 12 లక్షల మందికి రుణాలు అందనున్నాయి. అయితే ఇప్పటి వరకు రూ.5.35 లక్షల మందికి రుణాలను పంపిణీ చేసేసారు. ఇపుడు రెండో విడతగా మరికొంత మందికి సాయం చేయనున్నారు. అణగారిన వర్గాలవారిని అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం అని మోడీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: