ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ ని కొన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయంగా బలపడాలి అని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో పునరావాసానికి సంబంధించి ఎలాంటి నిధులు కూడా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలావరకు సీరియస్ గా ఉంది.

సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం తో ఎంత సఖ్యతగా  ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో కూడా విమర్శలు వస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడే కేంద్రం పై విమర్శలు చేసే ఆలోచనలోనే ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కాస్త కేంద్రంతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రానికి అన్యాయం చేయడంతో రాష్ట్రంలో సీఎం జగన్ కు మరింతగా మద్దతు పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం అన్యాయం చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఒక పక్కన రాష్ట్రం కష్టాల్లో ఉన్నా సరే  ఇలా ఎలా చేస్తారని... పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సీఎం జగన్ కు పరోక్షంగా మేలు చేకూర్చే అవకాశం ఉంటుందని రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆయన పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళలేక పోతున్నారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి సహాయం చేయకపోతే అది పరోక్షంగా సీఎం జగన్ కు రాజకీయంగా మేలు చేసే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: