దేశంలో కరోనా వైరస్ కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టారు. అయితే కోడలికి కోడలికి ఆన్లైన్ క్లాసులు వినడం కోసం ఒక వ్యక్తి టచ్ స్క్రీన్ ఫోన్ కొన్నాడు. అయితే వారం రోజుల తర్వాత ఆ ఫోన్.. పదే పదే వేడెక్కడం ప్రారంభించింది. ఛార్జింగ్ వెంటనే అయిపోతుంది. ఫోన్ సర్వీసింగ్ సెంటర్ కు తీసుకెళ్లాడు. విషయం వారితో చెప్పాక.. వాళ్లు ఏదో రిపేర్ చేసి పంపించారు. పలుమార్లు అదే సమస్య రిపీట్ అవుతుంది. కొత్త ఫోన్ ని రీప్లేస్ అడగడంతో షాప్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన అతడు.. షాపు ముందే పెట్రోల్ పోసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి సమీపంలోని ప్రహ్లాద్ పూర్ గ్రామానికి చెందిన భీమ్ సింగ్.. కొద్దిరోజుల క్రితమే తన కోడలి కోసం ఒక ఫోన్ కొన్నాడు. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఆ చిన్నారికి పాఠాలు వినడానికని దానిని తీసుకున్నాడు. వారం రోజుల దాకా ఆ ఫోన్ బాగానే పని చేసింది. కానీ తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది. ఉన్నట్టుండి ఫోన్ వేడెక్కడం.. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా కొద్దిసేపు కూడా రాకపోవడం.. తరుచూ స్విచ్ ఆఫ్ అవుతుండటం వంటివి అయ్యేవి. దీంతో భీమ్ సింగ్.. ఫోన్ ను సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు. వాళ్లు రిప్లేస్ చేయడం కుదరదని... కావాలంటే రిపేర్ చేస్తామే తప్ప కొత్తది ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పారు.

ఆయితే అక్కడ వారిని రిప్లేస్ చేయమని ఎంత బతిమిలాడినా వాళ్లు వినిపించుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన భీమ్ సింగ్... సదరు సంస్థ బయటకు వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు అతడి శరీరాన్ని చుట్టేశాయి. కాలుతున్న వేడిని తట్టుకోలేక భీమ్ సింగ్ హాహాకారాలు చేస్తున్నాడు. ఇది చూసిన అక్కడివారికి ఒక్కసారిగా ఏమవుతుందో అర్థం కాలేదు. పలువురు అక్కడే ఉన్న షాపులలోంచి నీటిని తీసుకొచ్చి భీమ్ సింగ్ ఒంటిమీద మంటలను ఆర్పారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాగా, ఈ ఘటనపై భీమ్ సింగ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: