అసోం మాజీ  ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్యం మరింత విషమించింది .. ఇటీవల కరోనా బారినపడ్డ తరుణ్ గొగోయ్ కోలుకున్న అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో ఈ నెల 2 వ తేదీన గౌహతి లోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు .. అప్పటి నుండి చికిత్స పొందుతున్న తరుణ్ గొగోయ్ నిన్న   ఆరోగ్యం మరింత క్షీణించినట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు ..

శనివారం రోజు అయన ఆరోగ్యం క్షీణించిందని ,శ్వాస తీసుకోవడం లో తరుణ్ గొగోయ్ ఇబ్బంది పడుతున్నారని అందుకే ఆయనకి వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని మంత్రి తెలిపారు .. తరుణ్ గొగోయ్ ఆరోగ్యం క్షీణించడంతో అయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని ,శరీరం లో అవయవాలు సరిగా పనిచేయడం లేదని  అసోం ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ పేర్కొన్నారు ..

సాధ్యమైనంత మేర అవయవాల పునరుద్దరణకు ప్రయతిస్తున్నామని వైద్యులు తెలిపారు .. అలాగే ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటున్నామని ఆ వైద్యుల  సలహా మేరకే  తరుణ్ గొగోయ్ కి చికిత్స చేస్తున్నామని చెబుతున్నారు ..

తరుణ్ గొగోయ్ అసోం రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు .. గత నెల అక్టోబర్ 25 వ తేదీన ఆయనకి కరోనా వైరస్ నిర్దారణ అయ్యింది .. ఆ తర్వాత తరుణ్ గొగోయ్ కరోనా నుండి కోలుకున్నారు.. కరోనా నుండి కోలుకున్న అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ..ఇప్పుడు అతని ఆరోగ్యం దెబ్బతిని వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు ..  తరుణ్ గొగోయ్ యొక్క ఆరోగ్య పరిస్థితిని  వాళ్ళ కుటుంబసభ్యులకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నామని వైద్యులు తెలిపారు ..  ..

కరోనా వైరస్ చాలా మంది ప్రముఖుల్ని బలి తీసుకుంది . అందులో కొందరు ప్రముఖులు కోలుకున్న వయసు రీత్యా అనారోగ్యాలు వెంటాడంతో వాటి వాళ్ళ  కొందరు మరణిస్తున్నారు .. కరోనా నుండి కోలుకున్న మరణం అయితే తప్పడం లేదు ..ఇలా ఇంకెంత మందిని చూడవలసి వస్తుందో .. 

మరింత సమాచారం తెలుసుకోండి: