వింతవింత చేష్టలతో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండే కోతులు ఒక నిండు ప్రాణం తీసాయి. ఇది నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజంగా నిజం. కొన్ని ఘటనలు వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆ ఘటన చూస్తే మాత్రం ఒల్లు గగుర్లు పుడుతుంటుంది. అలాంటిదే ఒక ఘటన కోతుల విషయంలో జరిగింది. చెట్లపై పిచ్చి పిచ్చిగా గెంతుతూ, పండ్లు ఫలాలను తింటూ పిల్లచేష్టలను చేస్తుంటాయి కోతులు.

అడవుల్లో తప్పా ఎక్కడా మనగలగలేని ఈ కోతులు అడవులు అంతరించి పోవడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలపై ఎగబడున్నాయి. ఇంట్లోకి చొరబడి ఇల్లంతా అల్లకల్లోలం చేస్తున్న విషయాలను మనం నిత్యం వార్తల్లోనూ చూస్తూనే ఉన్నాం. మనుషుల చేతుల్లోని ఆహారాన్ని లాక్కుపోయే ఈ కోతులు మూలంగా ఓ మహిళ దారుణంగా చనిపోయింది. ఇంతకి ఆ మహిళ ఎలా చనిపోయిందంటే... పూర్తి వివరాళ్లోకి వెలితే.. సూర్యపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల గ్రామంలో దోమల శ్రీలత(23) అనే మహిళ నివసిస్తోంది. 

ఆ మహిళకు నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. అయితే  ఆమె మూడో కాన్పు కోసం  తన పుట్టింటికి వెళ్లింది. ఇటీవలే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ బాలునికి రెండు నెలల వయస్సు ఉంటుంది.  అయితే ఈ క్రమంలో తన కూమారునికి పాలిచ్చి ఊయ్యాలలో పడుకోబెట్టి తను ఇంటిలో పని చేసుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలోనే శ్రీలతపై కోతులు దాడికి దిగాయి. ఆ సమయంలో ఆమె కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగుపెట్టింది. దాంతో  పరుగుపెట్టే క్రమంలో ఆమె కింద జారీపడింది. దాంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. 

దాంతో శ్రీలత తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కోతి మూకలు చేసిన దాడితో ముగ్గురు పిల్లలకు తల్లి లేకుండా పోయిందే దేవుడా.. అంటూ ఆ ఊరి గ్రామస్తులు రోధిస్తున్నారు. శ్రీలత భర్త సైదులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి.సాయప్రశాంత్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: