ప్రస్తుతం బిజెపికి దేశవ్యాప్తంగా తిరుగులేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. ఓవైపు పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టడమే కాదు రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆధిపత్యం సాధించి ప్రస్తుతం బిజెపి అధికారంలో కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తిరుగులేని పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నామరూపాలు లేని పార్టీ గా మారిపోయింది. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోంది.



 అయితే ప్రస్తుతం బిజెపి హవా ఎంతో బాగా కొనసాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఇప్పటికీ బీజేపీ తమ పార్టీని బలపరచుకోవాలని ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. కేంద్రంలో నరేంద్ర మోడీ ఎంతో అద్భుతమైన కొనసాగుతున్నప్పటికీ మోడీ పాలన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై  ఎలాంటి ప్రభావం చూపడం లేదు. గతంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఏకంగా కేజ్రీవాల్ అధికారంలోకి రావడం సంచలనంగా మారిపోయింది.


 ఇక వచ్చే సంవత్సరంలో బీజేపీకి మరో పెద్ద పరీక్ష ఉందని విశ్లేషకులు అంటున్నారు. 2021 సంవత్సరం లో ఓ వైపు పశ్చిమబెంగాల్లో మరోవైపు కేరళ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు రాష్ట్రాలలో ఇప్పటివరకు బీజేపీ విజయఢంకా మోగించింది  లేదు అన్న విషయం తెలిసిందే.  అంతేకాకుండా తమ పార్టీని బలపరచుకోవాలని ఈ రెండు రాష్ట్రాలలో ఎంతోకష్ట పడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2021 సంవత్సరం లో జరగబోయే ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతూ ఉందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు రాష్ట్రాలలో కూడా ఏప్రిల్ మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జూన్ వరకు ఫలితాలు రానున్నాయి ఒకవేళ బీజేపీ సత్తా చాటకపోతే బిజెపి తిరోగమనం ప్రారంభం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: