
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూకే ఆమోదం తెలపడంతో పెద్ద ఎత్తున పంపిణీ ప్రారంభం కానుంది. మిగతా వ్యాక్సిన్‌లతో పోల్చితే ఇది తక్కువ ధరకు లభించడమే కాదు, సాధారణ రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచవచ్చు. యూకేలోని మిలియన్ల ప్రజలకు వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమైందని.. ఈ వ్యాక్సిన్‌ను ఎవరైతే తీసుకుంటారో సమర్ధవంతంగా పనిచేస్తుందని..తెలిపింది ఆక్స్‌ఫర్డ్.
వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంది. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లోనూ వీటిని సరఫరా చేసేందుకు వీలుగా దాదాపు 5 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఇక యూకేలోనూ పెద్దఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇతర వ్యాక్సిన్ల కంటే వేగంగా, మరింత సమర్థవంతంగా రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని చెబుతోంది ఆక్స్‌ఫర్డ్. బ్రిటన్‌లో కొత్తగా వెలుగుచూసిన రకంపైనా పనిచేసే సామర్థ్యం ఉందని ఆస్ట్రాజెనెకా నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే, ఎంతవరకు ఇది ఎదుర్కొంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, దీనిపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ స్పష్టంచేశారు.
మరోవైపు కరోనా కల్లోలంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాల్లో.. ఇప్పడు వ్యాక్సిన్ హడావుడి మొదలైంది. ఇప్పటికే కరోనా రూపాంతరం చెంది.. భయపడుతుండటంతో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా వ్యాక్సిన్‌లు ఎలా పనిచేస్తాయా? అనే అనుమానం మొదలైంది. అయితే, ఈ వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్‌ను కూడా సమర్థంగా పనిచేస్తాయని ఆయా కంపెనీలు చెబుతున్న వేళ... న్న కోవ్యాక్స్ కూటమి భేటీ అయింది.
ఈ భేటీలో ప్రధానంగా వ్యాక్సినేషన్‌పై చర్చించింది కోవ్యాక్స్ కూటమి. కరోనా న్యూ స్ట్రెయిన్‌పై.. ప్రస్తుతం సిద్ధమైన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించింది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్‌ను సైతం ఎదుర్కొనే సత్తా.. ఆస్ట్రాజెనికా టీకా ఉందని.. ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాదు, త్వరలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్న ఆస్ట్రాజెనికా టీకా.. సాధారణ ధరల్లోనే అందుబాటులో ఉండనుంది.