ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం.. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రహదారులు.. అందుకే రహదారుల పక్కన ఉన్న స్థలాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అయితే ఏపీలో ఇంకా వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలన్న డిమాండ్‌ ఉంది. మారుమూల ప్రాంతాలకు ఇంకా చాలాచోట్ల చక్కటి రహదారి సదుపాయం లేదు. ఉన్న అరకొర రోడ్లకూ నిర్వహణ కరవైంది. అయితే ఇలాంటి పల్లె వాసుల కష్టాలు ఇప్పటి వరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పుడు సీఎం జగన్ అమరావతి ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు. అదేంటంటే.. రాష్ట్రంలో 1600 కిలోమీటర్ల మేర రహదారులను డబుల్ లైన్ గా మార్చబోతున్నారు. ఈ రహదారులను గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం కోసం రహదారుల నిర్మాణం కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తో ఏపీ ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 323 మిలియన్ డాలర్ల చొప్పున రెండు ప్రాజెక్లుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  

రాష్ట్ర రహదారుల నెట్వర్క్ లో 1600 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ వేయబోతున్నారు. ఇంకా దెబ్బతిన్న వంతెన మార్గాల అభివృద్ధి కోసం 323 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నారు.
గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలకు అనుసంధానం కోసం 1400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, డబుల్ లైన్ కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మరో 323 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించనుంది.  

ఈ అవగాహన ఒప్పందం పై పీ ప్రభుత్వ రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు, కేంద్ర ప్రభుత్వం తరపున బలదేవ్ పురుషార్ధ సంతకాలు చేశారు. ఈ రుణాలను రాష్ట్రం 32 ఏళ్ళలో తీర్చుకునేందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్  అవకాశం కల్పించింది. అంతే కాదు.. 5 ఏళ్ల పాటు రుణం చెల్లింపు పై మారటోరియం కూడా ఉంటుందని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్  స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: