పోలీసులు ఎన్ని అంక్షలు పెట్టినా కాయ్ రాజా కాయ్ అంటూ కయ్యానికి కాలుతువ్వుతున్నాయి కోడి పుంజులు. బరులు కట్టి మరి జోరుగా ఆడిస్తున్నారు పందెం రాయుళ్లు. అసలు  జరుగుతాయా లేదా అనే ఉత్కంఠకు తెరదించుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఆడిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగ సందడి కనిపిస్తోంది. అయితే సంక్రాంతికి వారం ముందు నుంచే కోడి పందాల హడావిడి మొదలు పెట్టేశారు పందెం రాయుళ్లు. పోలీసులు కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నించినా కంట్రోల్‌లోకి రాలేదు. గత కొద్దీ రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ దాడులు చేసినా... గతంలో పందాలు నిర్వహించిన వారిని గుర్తించి బైండోవర్‌ చేసినా.. ఫలితం లేకపోయింది.

చాలా ప్రాంతాల్లో పామాయిల్, కొబ్బరి తోటల్లో, ఆక్వా చెరువుల సమీపంలో, లేఅవుట్‌లలో భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. గతంలో పట్టుబడిన వారిపై బైండోవర్‌ కేసులు పెట్టి ముందుగానే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. పాత బరుల వద్ద ఫ్లెక్సీ కట్టి మరి పోలీసులు ప్రచారం చేసి, హెచ్చరించినా పందాలు మాత్రం ఆగడం లేదు.

అయితే ఈ సారి కరోనా ఆంక్షలతో అధికారులు హెచ్చరికలు జారీ చేయటంతో పందాలపై ప్రభావం ఉంటుందని అంతా భావించారు. అందుకు భిన్నంగా పందాలు సాగుతున్నాయి. ఆశించిన స్దాయిలో పందాలు లేకుండాపోవటంతో ఉన్న ఒకటి రెండు బరుల్లోనే పందెం రాయుళ్ళు సంక్రాంతిని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రతి ఏటా కోడి పందాలు అంటే ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడ గోదావరి జిల్లాలకు తరలివచ్చేవారు. ఈ సారి కరోనాతో అంతా పందాలకు దూరంగా ఉన్నారు. దీంతో పందాలు చూసేందుకు జనం భారీగానే తరలి వచ్చినా, ఆర్దికంగా అంత బాగోలేదని  అంటున్నారు.

సంక్రాంతికి కోనసీమలో పందాల జోరుగా సాగుతున్నాయి. తొలిరోజు పందాలకు పెద్ద ఎత్తు జనం తరలి వచ్చారు. చిన్న చిన్న బరులకు అనుమతులు లేకపోవటంతో ఉన్న పెద్ద బరులకు మాత్రం డిమాండ్ భారీగా పెరిగింది.




మరింత సమాచారం తెలుసుకోండి: