
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో మార్పులు చేయకపోతే మాత్రం పార్టీ పరిస్థితి దారుణం గా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా నమ్ముకొని ముందుకు వెళుతుంది. దీనివలన పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోతుందనే ఆవేదన కార్యకర్తలలో ఎక్కువగా ఉంది. ప్రధానంగా అధికార వైసిపి మీద పోరాటం చేసే విషయంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు దాగుడుమూతలు ఆడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న సరే వారి పనితీరు లో ఏ మాత్రం మార్పు రావడంలేదు. కొంతమందిని కలుపుకొని విషయంలో కూడా అనంతపురం జిల్లా నేతలు వెనకడుగు వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో పార్టీ ఎటు కాకుండా పోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు పార్టీ పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారని కూడా అంటున్నారు.
వారి విషయంలో ముందు నుంచి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొంతమంది కార్యకర్తల ద్వారా సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఇద్దరు మాజీ మంత్రులకు పార్టీ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే స్థానిక సంస్థల్లో ఈ ప్రభావం పడుతుంది కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత వారి విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.