ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్ లో ఎక్కడ చూసినా పుచ్చకాయలు ఎరుపు గానే ఉంటాయి. కాని ఎరుపు రంగు కాకుండా ఇతర రంగులలో ఉన్న పుచ్చకాయలను ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు కానీ.. ఎరుపు రంగు కాకుండా ఇతర రంగాలలో కూడా పుచ్చకాయలు ఉంటాయి అని చెబితే ఎవరైనా నమ్ముతారా. అసలు సిసలైన ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలు మరో రంగులో ఎందుకు ఉంటాయి అని నవ్వుకుంటారు. కానీ అలా అనుకున్నారు అంటే మీరు పొరపాటు పడ్డట్టే ఎందుకంటే పుచ్చకాయలు కేవలం ఎరుపు రంగులో ఉండడమే కాదు పసుపు రంగులో కూడా ఉంటాయట. ఇటీవలే మార్కెట్లోకి పసుపు రంగు పుచ్చకాయలు కూడా వస్తున్నాయి ఇక వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఈ పసుపు రంగు పుచ్చకాయలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అక్కడి రైతులు. అయితే ఇటీవలే బెంగుళూరులోని శివారు ప్రాంతాల్లో కూడా ఈ పసుపురంగు పుచ్చకాయలను అత్యధికంగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇక ప్రస్తుతం ఈ పసుపు రంగు పుచ్చకాయలు అన్ని మార్కెట్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పసుపురంగు పుచ్చ కాయలలో గింజలు తక్కువగా ఉండటం.. గుజ్జు ఎక్కువగా ఉంటుందట. పుచ్చకాయ జ్యూస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయట. అయితే వీటి ధర ప్రస్తుతం కిలో 20 రూపాయల వరకు మార్కెట్లో పలుకుతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి