టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు అని అన్నారు. సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపించాల్సింది అని వ్యాఖ్యలు చేశారు. చెక్‍పోస్టులను పోలీసులు ఎందుకు ఎత్తివేశారు అని నిలదీశారు.బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారు అని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి అని సూచించారు. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్ అనే వ్యక్తి కోసం కాదు అని సూచించారు.

 ఇవాళ తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది అని ఆరోపణలు చేశారు. బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‍ఆర్ కన్వెన్షన్‍లో వేలమందిని ఉంచారు అని అన్నారు. బయటి వ్యక్తులు తిరుపతిలో ఉంటే పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు అని నిలదీశారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరుడైన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారు? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారు అని మండిపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలో పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు అని పోలీసులు ప్రశ్నించారు. వందలమందిని తీసుకువచ్చి పర్యాటకులు అంటున్నారు అని విమర్శించారు. వందలమందిని రెడ్‍హ్యాండెడ్‍గా పోలీసులకు పట్టించాం అన్నారు చంద్రబాబు. తిరుపతిలో కేంద్ర బలగాలు ఏమయ్యాయి, వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించే బాధ్యత ఈసీపై ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించారు అంటూ ధ్వజమెత్తారు.  నా రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణం ఎప్పుడూ చూడలేదు అన్నారు. వైసీపీ అరాచకాలను ఖండిస్తున్నా అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: