తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా నమోదు కావడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న విషయం. కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదోక నిర్ణయం తీసుకుంటూనే ఉంది. ఇక లాక్ డౌన్ నిర్ణయం కూడా నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో సిఎం సహా మంత్రులు అందరూ కూడా దీనికి సంబంధించి ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు వాస్తవ పరిస్థితి తెలుసుకుంటున్నారు.

ఈ అంశానికి సంబంధించి తాజాగా మంత్రి కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటీ అనేది వివరించారు. కరోనా పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి లో బెడ్లు , ఆక్సిజన్ , రేమిడిసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి అని వివరించారు. బ్లాక్ ఫంగస్ పై ఆందోళన అవసరం లేదు అని మంత్రి స్పష్టం చేసారు. మందులు అందుబాటులో ఉన్నాయి అని మీడియా కు వివరించారు. ప్రతి రోజు ఆసుపత్రిల్లో వాడే ఆక్సిజన్ పై వివరాలు ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు.

మితిమీరిన ఇంజక్షన్లు , అనవసర ఆందోళనలు వద్దు అని ఆయన స్పష్టం చేసారు. సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లు , వైద్య శాఖ అధికారులతో రోజు మాట్లాడుతున్నారు అని తెలిపారు. రాబోయే రోజుల్లో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ , రేమిడిసివర్ , ఆక్సిజన్ ల ఉత్పత్తి పై సమావేశం అవుతాం అని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ కేసులు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రులు చెప్తున్నారు అని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా నియంత్రణ లో ఉంది అని మంత్రి కేటిఆర్ స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: