తెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఏం చేస్తారు ఏంటనే దానిపై స్పష్టత రాకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ప్రజల్లో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా షర్మిల రాజకీయం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లే విధంగా షర్మిల వ్యవహరించే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల విషయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు.

త్వరలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని షర్మిల పార్టీ ప్రారంభించిన తర్వాత వారు పార్టీలో కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. విపక్షాల విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమె నేరుగా కెసిఆర్ టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది కీలక నాయకులను విపక్షాల నుంచి తన పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా కొంతమంది నాయకులు రంగంలోకి దించారు అని అంటున్నారు.

ఒక మాజీ ఎంపీ తోపాటుగా ప్రస్తుత ఎంపీ కూడా షర్మిల పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా ఆమె పార్టీలోకి రావడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కూడా ఇప్పుడు ఆమె పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారని త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: