ఇక మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటెల ఎక్కడికి వెళ్ళినా అక్కడ వేల సంఖ్యలో జనాలు ఈటెలకు జై కొట్టారు. ఈ నేపథ్యంలో ఇక టీఆర్ఎస్ పార్టీకి బిసీ వర్గం నుంచి ఓట్లు రావడం కష్టమే అని అనుకున్నారు అందరు. కానీ ఈటెలను మంత్రి పదవి నుంచి తొలగించడానికి ఎలాగైతే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారో.. ప్రస్తుతం బిసి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మరోసారి పదునైన వ్యూహాలతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్న.. బీసీ వర్గానికి అత్యధిక ఓటింగ్ శాతం అన్నది అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ అత్యధిక ఓటింగ్ శాతం మళ్లీ తమ వైపు ఉండేలా ఇటీవలే కేసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను పొడిగిస్తూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడగించాలని నిర్ణయించినట్లు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో అటు బీసీలకు ఉద్యోగాల్లో కల్పిస్తున్న అయిదేళ్ల వయోపరిమితిని కూడా మరింతగా పొడిగించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇలా బిసి నాయకుడైన ఈటెలను మంత్రివర్గం నుంచి తొలగించినప్పటికీ బిసి ఓటు బ్యాంకు మాత్రం తమ వెంటే ఉండేలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు కేసీఆర్. ఇక ఈటెల ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో కేసీఆర్ పై ఆగ్రహావేశాలతో ఉన్న బీసీ వర్గం ఇక ఇప్పుడు ఈ రిజర్వేషన్లతో కూల్ అవుతుందో లేదో చూడాలి మరి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి