ఓవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో ప్రాణ భయం కూడా పెరిగిపోతుంది  ఇలాంటి నేపథ్యంలో కరోనా వైరస్ కష్టకాలంలో వాక్సినేషన్ ప్రక్రియ ఎంతో కీలకంగా మారిపోయింది. అయితే ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో కూడా కింది స్థాయిలో అవకతవకలు జరిగినట్లు గానే ప్రస్తుతం ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న వ్యాక్సినేషన్  ప్రక్రియలో కూడా ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలే టీకా ప్రక్రియలవ్ అవకతవకలు బయటపడడం సంచలనంగా మారిపోయింది.  ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం జరుగుతుంది.



 వివిధ విడతలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే   తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే  వాక్సినేషన్ ప్రక్రియ కరోనా కాలంలో కీలకంగా మారిన నేపథ్యంలో ఎంతోమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.



 ఇటీవలి నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని విషయాన్ని అధికారులు గుర్తించారు. అర్హులకు టీకా ఇవ్వడమే కాదు ఎంతో మంది అనర్హులకు సైతం టీకా వేసి అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు తేల్చి చెప్పారు.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వేల మంది అనర్హులకు టీకా వేసినట్లు గుర్తించారు అధికారులు. అయితే ఇలా వ్యాక్సిన్ విషయంలో నిమ్స్ లో అక్రమాలు బయట పడడంతో రాష్ట్రంలోని మిగతా హాస్పిటల్స్ లవ్ కూడా ఇలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని భావించిన ప్రభుత్వం. వెంటనే విజిలెన్స్ బృందాలను రంగంలోకి దింపింది. ఆయా ఆసుపత్రులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విచారణ చేపట్టాలని.. అవకతవకలు జరిగాయా లేదా గుర్తించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: