కరోనా సోకని ఆ కుటుంబంలో గంటల వ్యవధిలో తల్లి, తండ్రి, కొడుకు మృతిచెందారు. వింటేనే కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన నారాయణపేటలో జరిగింది. జిల్లాలోని దామరగిద్ద మండలంలో జరిగిన ఈ విసాద సంఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. జంగం భద్రయ్యస్వామి (65), శశికళ (60) అనే ఇద్దరు భార్యాభర్తలకు నాగరాజు, శంభులింగం, శాంతయ్య కుమారులు కాగా ఓ కుమార్తె కూడా ఉంది. భద్రయ్య స్థానికంగా ఆర్‌ఎంపీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇక ఆయన రెండో కొడుకు శంభులింగం కూడా ఆర్ ఎంపీగానే పనిచేస్తున్నాడు.
ఇలా అందరూ ఏదో ఒక పని చేస్తూ బతుకుతున్నారు. కానీ వారిని కరోనా కాటు వేసింది. ఇరవై రోజుల క్రితం శంభులింగం (42)కు కరోనా లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉంచారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక భద్రయ్యకు కరోనా రావడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వీరిని చూసేందుకు మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు శశికళ వెళ్లి.. వచ్చింది. కానీ అప్పటికే ఆమెకు కూడా కరోనా లక్షణాలు ఉండటంత కరోనా టెస్టు చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
భర్త, కొడుకు చావు బతుకుల్లో ఉన్నారన్న బెంగతో ఆమె ఆరోగ్యం బాగా క్షనించడంతో గురువారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత శశికల చనిపోయింది. ఇక ఈమె చనిపోయిన ఆరు గంటల తర్వాత కుమారుడు శంభులింగం కూడా శుక్రవారం ఉదయం 8 గంటలకు కన్నుమూశాడు. ఇక వీరికి అంత్యక్రియలు నిర్వహించి కుటుంబ సభ్యులు ఇంటి వస్తున్న క్రమంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో భద్రయ్య కూడా కరనా కాటుకు బలయ్యారు. దీంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. గంటల వ్యవధిలో కరోనా కోరల్లో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి