టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు ఇళ్ల‌పై ఇటీవ‌ల ఈడీ సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే అవినీతి ఆరోప‌ణ‌ల త‌ర‌వాత‌ నామా నాగేశ్వ‌ర్ రావు మొద‌టి సారిగా మీడియా ముందుకు వ‌చ్చారు.  నామా మాట్లాడుతూ...త‌న‌ గురించి ప్రజలకు తెలుసని అన్నారు. తాను ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉన్నాన‌ని నామా వ్యాఖ్యానించారు. కేసీఆర్ త‌న‌ను ఏ నమ్మకంతో పార్లమెంటరీ పార్టీ నాయకునిగా పెట్టారో అదే నమ్మకం తో పని చేస్తాన‌ని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని నామా అన్నారు. త‌న‌ బలం కేసీఆర్ అని బలగం త‌న నియోజక వర్గంలోని ప్రజలేన‌ని చెప్పారు. 40 సంవత్సరాల క్రితం మదుకాన్ ను స్థాపించాన‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు. ముంబై నుంచి మంగళూరు ప్రాజెక్టు పూర్తి చేశామ‌ని తెలిపారు. 

చైనా బార్డర్ లో కూడా తాము రోడ్లు వేస్తున్నామ‌ని నామా వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లో ఉండటం వల్ల ఆ కంపెనీ లు త‌న‌ సోదరులు చూస్తున్నట్టు తెలిపారు. రాంచీ ఎక్స్ప్రెస్ వే, ఎస్పీవి బీవోటీ ప్రాజెక్టు 30శాతం ఈక్విటీ తో 2011లో ప్రారంభం అయిందన్నారు. ఎన్ హెచ్ ఏ అగ్రిమెంట్ తర్వాత 80 శాతం 90 రోజుల్లో 100శాతం సైట్ ఇవ్వాలన్నారు. కానీ ఏడేళ్లు అయినా ఎన్ హెచ్ ఏ పూర్తి సైట్ ఇవ్వలేక పోయిందన్నారు. సైట్ ఇచ్చిన మేరకు 60 శాతం పని పూర్తి అయిందన్నారు. దాదాపుగా మెజర్ కూడా అయిందని... కేవలం 10శాతం మెజర్ మాత్ర‌మే పెండింగ్ లో ఉందని చెప్పారు. ఏ కారణం చేతనో కంపెనీ ని టర్మీనెట్ చేశారని అన్నారు. 1655కోట్ల ప్రాజెక్టు లో 463 కోట్లు కంపెనీ.. మిగతాది బ్యాంక్ లు ఇవ్వాలన్నారు. ఆ డబ్బులు మొత్తం ఎస్క్రూ అకౌంట్ లో వేయాలని....దానిపై పూర్తి అధికారం బ్యాంక్ దే అని చెప్పారు.

485 కోట్లు కంపెనీ పెట్టిందని....652 కోట్లు మాత్రమే బ్యాంక్ లు పెట్టాయ‌ని చెప్పారు. ఎన్ హెచ్ ఏ సైట్ ఇవ్వక పోవడం వల్లనే ప్రాజెక్టు డిలే అయిందన్నారు. 50శాతం పని పూర్తి అయినందున మిగితా నిధులు తామే ఇస్తామని ఎన్ హెచ్ ఏ హామీ ఇచ్చి వెనక్కి వెళ్ళిందన్నారు. ఎవరూ ఈ ప్రాజెక్టు మీద కంప్లైంట్ చేయలేదని చెప్పారు. బీహార్ లో చెట్లు కొట్టిన కేసుకి సంబంధించి ఒక పిల్ లో ఈ ప్రాజెక్టు ని ఇంప్లీడ్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు. ఆర్బిస్ట్రేషన్ ట్రిబ్యునల్ లో త‌మ‌కు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. అవార్డ్ అయ్యే వరకు కంపెనీ వేచి చూస్తుందన్నారు. ఆ కంపెనీ లో తాను డైరెక్టర్ కూడా కాదని నామా స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: