మాన్సాస్  ట్రస్ట్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ట్రస్ట్ వ్యవహారంతో పాటు గా సింహాచల దేవస్థానం వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మీరు పెడుతున్నారని ఈ నేపథ్యంలోనే అశోక్ గజపతి రాజు అన్న కుమార్తె సంచయిత గజపతిరాజు ని రంగంలోకి దించాలని దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై విజయనగరం ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని ప్రచారం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.

2020లో సంచైత గజపతిరాజు ని మానస ట్రస్ట్ చైర్మన్ గా అదేవిధంగా సింహాచలం దేవస్థానం చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయగా అశోక్ గజపతిరాజు హైకోర్టుకు వెళ్లి మరీ విజయం సాధించారు. ఆయన తిరిగి ట్రస్ట్ చైర్మన్ గా అదేవిధంగా సింహాచలం దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు సంచయిత గజపతిరాజు పరిస్థితి ఏంటి అనే దానిపైనే అనుమానాలు అన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సంచయత ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మరో ఆలోచన చేశారని రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి గౌరవించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పుడు ఆమెను వెనక్కి పంపిస్తే అనవసరంగా మహిళను ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటుంది అనే అభిప్రాయం ప్రజల్లో కూడా కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అటు తెలుగుదేశం పార్టీ కూడా కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తోంది. కాబట్టి తనను నమ్మి వచ్చిన వాళ్లకు తాను అన్యాయం చేయను అనే విషయాన్ని జగన్... ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా చెప్పే అవకాశాలు ఉండవచ్చు అనేది రాజకీయ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: