ప్రతి ఏడాది దివ్యాంగులు ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది ఇక ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం సదరన్ క్యాంపు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇటీవలే జగన్ ప్రభుత్వం సదరన్ క్యాంపు లను ప్రారంభించింది. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది జగన్ ప్రభుత్వం. అయితే ఇక ధ్రువీకరణ పత్రాల కోసం దివ్యాంగులు రోజుల తరబడి వేచి చూసి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదరన్ క్యాంపు లు ప్రారంభం అయ్యాయి.
ఈ క్రమంలోనే ఎంతో మంది దివ్యాంగులు ఇక సదరన్ క్యాంపు లకు బారులు తీరుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సదరన్ క్యాంపు లు ప్రారంభం కావడంతో ఇక దివ్యాంగులు సదరన్క్యాం పు ధ్రువీకరణ పత్రం పొందేందుకు వెళ్తున్నారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ల బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే అయితే ఏకంగా దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. 171 ప్రభుత్వాసుపత్రిలో సదరన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా జిల్లా ఆసుపత్రిలలో కూడా క్యాంపులు కొనసాగుతున్నాయి అయితే గతంలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన సదరన్ క్యాంపు మళ్లీ ప్రారంభం కావడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు సదరన్ క్యాంపు లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి