
మన దేశ రాజకీయాల్లో మనం రాజకీయం చేయడానికి కూడా ట్విట్టర్ వ్యాపారాలు చేస్తుందని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఈ రకమైన విధానాన్ని తాను ఎంత మాత్రం ఇష్టపడేది లేదని అన్నారు రాహుల్ గాంధీ. ఇది దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడి అని అబివర్ణించిన రాహుల్ గాంధీ... ఇది రాహుల్ గాంధీపై దాడి కాదు అన్నారు. నాకు 19-20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని మీరు వారి అభిప్రాయాలను చెప్పే హక్కుని అడ్డుకున్నారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు.
గురువారం, కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండి ల్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను కంపెనీ బ్లాక్ చేసిందని పార్టీ నేతలు ఆరోపించారు. దాదాపు 5 వేల మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. చట్టాలను ఉల్లంఘించి, ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత అత్యాచార బాధితురాలి కుటుంబ చిత్రాలను షేర్ చేసారు కాబట్టి బ్లాక్ చేసామని ట్విట్టర్ పేర్కొంది. పార్లమెంట్ లో మాట్లాడేందుకు మాకు అనుమతి లేదు అన్న కాంగ్రెస్ నేతలు చివరకు మీడియా నియంత్రించబడుతుంది అని ట్విట్టర్ ని కూడా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేసారు.