తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలుకు ముహూర్తం ఖరారైయింది. అక్టోబర్ 7 వ తేది నుంచి 15 వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.  ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది.  7 వ తేది ధ్వజా రోహణం తో ప్రారంభం కానున్నాయి తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలు. 7 వ  తేది రాత్రి పెద్ద శేష వాహనం ఉండనుండగా.. 8 వ తేది ఉదయం చిన్న శేషవాహనం ….రాత్రి హంస వాహనం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.  9 వ తేది ఉదయం సింహ వాహనం….రాత్రి ముత్యపు పందిరి వాహనం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 

ఇక 10 వ తేది ఉదయం కల్పవృక్ష వాహనం….రాత్రి సర్వభూపాల వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. అలాగే 11 వ తేది ఉదయం మోహిని అవతారం….రాత్రి గరుడ వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 12 వ తేది ఉదయం హనుమంత వాహనం….సాయంత్రం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం…..రాత్రి గజ వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 13 వ తేది ఉదయం సూర్యప్రభ వాహనం….రాత్రి చంద్రప్రభ వాహనం ఉండనున్నాయి.  14 వ తేది ఉదయం రథం బదులుగా సర్వ భూపాల వాహనం ….రాత్రి అశ్వవాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి.

15  వ తేది ఉదయం చక్రస్నానం….రాత్రి ధ్వజా అవ రోహణం తో  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు  కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ నిర్వహిస్తామని  తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది కంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది టిటిడి బోర్డు. కరోనా నేపథ్యంలో గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించ లేక పోయామని టీటీడీ తెలిపింది. కాగా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.... శ్రీవారి దర్శనాల సంఖ్య పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: