సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయ మంత్రాంగం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లోనూ.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లోనూ విజ‌య‌న‌గ‌రం జిల్లా వ‌ర‌కు బొత్సే చ‌క్రం తిప్పుతూ ఉంటారు. బొత్స రాజ‌కీయ మంత్రాంగం ముందు మ‌హామ‌హులే ఆగ‌రు. బొత్స ఫ్యామిలీకి ఎన్ని సీట్లు అయినా ఇవ్వాల్సిదే. నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డే బొత్స ఫ్యామిలీకి ఏకంగా నాలుగు సీట్లు ఇచ్చారు. విజ‌య‌న‌గ‌రం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ, ఇక బొత్స చీపురుప‌ల్లి నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక బొత్స సోద‌రుడు అప్ప‌ల న‌ర‌సయ్య గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న మేన‌ళ్లుడు బ‌డ్డుకొండ అప్ప‌ల నాయుడు నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే అయ్యారు.

ఇక ఇప్పుడు వైసీపీ పాల‌న‌లోనూ బొత్స ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర శేఖ‌ర్ సైతం బొత్స‌కు స‌మీప బంధువు. ఇక ఇప్పుడు బొత్స ఫ్యామిలీలో మ‌రో కీల‌క ప‌ద‌వి ద‌క్క‌బోతోంది. బొత్స మేన‌ళ్లుడు అయిన మ‌జ్జి శ్రీను విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ చైర్మ‌న్ కాబోతున్నారు. గ‌తంలో బొత్స వైఎస్ కు ఎంత స‌న్నిహితంగా ఉండి కీల‌క ప‌ద‌వ‌లు ద‌క్కించుకున్నారో ఇప్పుడు జ‌గ‌న్ తోనూ అంతే స‌న్నిహితంగా ఉండి కీల‌క ప‌ద‌వులు ద‌క్కించుకుంటున్నారు.

అయితే ఇటీవ‌ల ఆయ‌న వ‌య‌స్సు పై బ‌డ‌డంతో పాటు కాస్త అనారోగ్యానికి గురి కావ‌డంతో ఆయ‌న స్పీడ్ త‌గ్గింద‌ని అంటున్నారు. ఈ టైంలో నే ఆయ‌న మ‌రోసారి చ‌క్రం తిప్పేసి కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని కూడా త‌న ఫ్యామిలీలో చేర్చేసుకుంటున్నారు. ఇక గ‌తంలో ఈ ప‌ద‌విని ఆయ‌న భార్య ఝాన్సీ రెండు సార్లు చేప‌ట్టారు. ఇక బోత్స మేన‌ళ్లుడిగా జిల్లాలో చ‌క్రం తిప్పుతోన్న మ‌జ్జి శ్రీనుకు ఇప్పుడు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: