టీడీపీ నేత‌లు,  కార్యాల‌యాలపై  చేప‌ట్టిన దాడుల‌కు నిర‌స‌న‌గా నేడు రాష్ట్రబంద్ కొన‌సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోబంద్ ప్ర‌భావం బాగా క‌నిపిస్తోంది. ఉద‌యం నుండే టీడీపీ శ్రేణులు రొడ్డు ఎక్కారు. అన్ని జిల్లాల‌లో వివిధ ప్రాంతాల్లో ఆందోళ‌న చేప‌డుతున్నారు. బ‌స్సుల‌ను అడ్డ‌కునేందుకు య‌త్నించారు. మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా  వైసీపీ నేత‌లు నిర‌స‌న తెలుపుతున్నారు.

టీడీపీ నేత‌లు, పోలీసుల మ‌ధ్య కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.  పోలీసులు నిర‌స‌న‌కారుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కృష్ణా, గుంటూరు, శ్రీ‌కాకుళం, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌లో అరెస్టులు చేప‌ట్టారు. పోలీసులు ఆందోళ‌న చేప‌డుతున్న కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకొని అడ్డుకున్నారు. మ‌రోవైపు పార్టీ ఆఫీస్ ఉద్యోగి బ‌ద్రి త‌ల‌పై సుత్తితో దాడి చేశారు. దీంతో పోలీసుల‌కు బ‌ద్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేశారు వైసీపీ నాయ‌కుల‌పై. ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై కేసు న‌మోదైంది. అదేవిధంగా టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన వైసీపీ నాయ‌కులు 70 మందిపై కేసు న‌మోదు చేసిన‌ట్టు తాజాగా డీజీపీ వెల్ల‌డించాడు.  రెండు రోజుల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.

తెదేపా అధినేత చంద్ర‌బాబునాయుడు పిలుపు ఇచ్చిన నేప‌థ్యంలో బంద్ చేప‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారిని ప‌లు చోట్ల ముంద‌స్తుగా అరెస్టులు కొన‌సాగాయి. టీడీపీ నాయ‌కుల‌ను గృహ‌నిర్భందంలో ఉంచేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు త‌దిత‌ర ప్రాంతాల్లో నాయ‌కుల‌ను నిర్భందించారు. పోలీసులు బ‌ల‌గాల‌ను రంగంలోకి దించి ప‌రిస్థితిని అదుపుత‌ప్ప‌కుండా జాగ్ర‌త్త వ‌హించారు.  అక్క‌డ‌క్క‌డ బ‌స్టాండ్ ముందు పోలీసులు పెద్ద‌సంఖ్య‌లో కాపాలా కాసారు. బ‌స్సులు తిరిగేందుకు పోలీసులు భ‌ద్ర‌తా క‌ల్పించారు. మ‌రోవైపు బంద్ కు విజ‌య‌వాడ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ మ‌ద్ద‌తివ్వ‌లేదు. వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డంతోనే.. ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. క‌రోనా కాలంలో వ్యాపారాలు లేక  ఇప్ప‌టికే వ్యాపార‌స్తులు ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ బంద్ వ‌ల్ల ఇంకా అవ‌స్త‌లు ప‌డాల్సి వ‌స్తుంద‌ని.. స‌మాజానికి ఏమి ఉప‌యోగం లేద‌ని చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వెల్ల‌డించింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: