సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ తెలుసుకోగలుగుతున్నారు. అయితే గతంలో ఉదయం లేచి బ్రష్ చేసుకుంటున్న సమయంలో ఏకంగా టూత్ బ్రష్ ని పొరపాటున కొంతమంది వ్యక్తులు మింగేయడం లాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఇలా పొరపాటు మింగిన టూత్ బ్రెష్ ను డాక్టర్లు ఎంతో కష్టపడి బయటకు తీశారు. అయితే ఇలా పొరపాటున దేనినైనా మింగితే అది కడుపు లోకి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా సెల్ఫోన్ మింగేశాడు. ఆ తర్వాత దానిని అసలు పట్టించుకోకుండా వదిలేశాడు. దీంతో ఆరు నెలలపాటు సెల్ఫోన్ కడుపులోనే ఉండిపోయింది.


 ఇక ఆరునెలల తర్వాత అతనికి కడుపునొప్పి రావడం తో చివరికి వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టాడు. తనకి జరిగిన ఘటన గురించి వివరించాడు. ఇదంతా విని వైద్యులే ఒక్కసారిగా షాకయ్యారు. చివరికి వైద్యులు ఎంతో కష్టపడి ఆ మొబైల్ బయటకు తీశారు. ఈ ఘటన దక్షిణ ఈజిప్ట్ లో చోటుచేసుకుంది. ఆస్మాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరు నెలల క్రితం పొరపాటున మొబైల్ మింగేసాడు. అయినప్పటికీ అతను ఎక్కువగా టెన్షన్ పడలేదు. ఆ ఫోన్ లోపల అరిగిపోయి  మలం ద్వారా బయటకు వస్తుంది అని భావించాడు. దీంతో  ఫోన్ మింగడాన్ని లైట్ తీసుకున్నాడు.



 ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి. అయితే మొదట్లో మొబైల్ ని మింగిన తర్వాత ఇబ్బంది లేకపోయినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ఆహారం తీసుకోవడంలో ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ వైద్యులను సంప్రదించ లేదు. కాగా ఇటీవలే కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో విలవిలలాడి పోయాడు. దీంతో చేసేదేమీ లేక వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టాడు. అయితే జరిగిన విషయం మొత్తం చెప్పడంతో వైద్యులు సైతం అవాక్కయ్యారు. పరీక్షలు నిర్వహించి మొబైల్ ను గుర్తించారు. చాలాకాలం పాటు మొబైల్ కడుపులోనే ఉండడంతో కడుపులోనే పేగులకు గాయాలై ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. ఇక వెంటనే శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న స్మార్ట్ ఫోన్ ను బయటకు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: