గత ఎన్నికల్లో జగన్ గాలి టీడీపీకి ఎంత నష్టం చేసిందో అందరికీ తెలిసిందే. అలాగే రాజకీయంగా జనాలకు పెద్దగా తెలియని నాయకులు వైసీపీ తరుపున ఎలా గెలిచేశారో చెప్పాల్సిన పని లేదు. కేవలం జగన్‌ని చూసి జనం వైసీపీ తరుపున చాలామంది ఎమ్మెల్యేలని గెలిపించేశారు. అలా ఇద్దరు శ్రీదేవిలని జనం ఎమ్మెల్యేలుగా గెలిపించారు. తాడికొండలో ఉండవల్లి శ్రీదేవిని, పత్తికొండలో కంగాటి శ్రీదేవిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు.

వాస్తవానికి చెప్పాలంటే 2019 ఎన్నికల ముందు వరకు...వీరి గురించి సొంత నియోజకవర్గ ప్రజలకే పెద్దగా అవగాహన లేదని చెప్పాలి. కానీ ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన ఈ ఇద్దరు నిదానంగా జనాలకు తెలుస్తూ వచ్చారు. సరే జగన్ గాలిలో గెలిచిన ఈ ఇద్దరు శ్రీదేవిలు...ఎమ్మెల్యేలుగా ఎలా పనిచేస్తున్నారు? రెండున్నర ఏళ్లలో ప్రజా మద్ధతు ఇంకా దక్కించుకున్నారా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి.

రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి ప్లస్‌లు కంటే మైనస్‌లే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఓ వైపు రాజధాని అంశం ఎలాగో ఆమెకు బాగా మైనస్...పైగా ఎమ్మెల్యేగా కూడా ఆమెకు ప్లస్ మార్కులు ఏమి పడటం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో అక్రమాలు కూడా ఎక్కువయ్యాయని తెలుస్తోంది. పేకాట క్లబ్బులు నిర్వహించడం, ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు లాంటివి శ్రీదేవికి మైనస్ అవుతున్నాయి.

ఇటు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవికి సైతం ఎమ్మెల్యేగా మంచి మార్కులు పడటం లేదని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ టీడీపీ సరిగా లేకపోవడం ఎమ్మెల్యేకు ప్లస్. కాకపోతే ఇక్కడ టీడీపీ తరుపున పనిచేస్తున్న కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి రానున్న రెండున్నర ఏళ్ళు పత్తికొండలో శ్రీదేవి ఏమన్నా కష్టపడితే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది లేదంటే అంతే సంగతులు. అటు తాడికొండలో శ్రీదేవికి మాత్రం ఎలాంటి ఛాన్స్ వచ్చేలా లేదు. ఆమెకు గెలుపు దూరంగానే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: