చైనా తీరు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది. ప్రపంచ దేశాలను దెబ్బ తీయడానికి ఎన్నో రకాల కుట్రలు పన్నుతు ఉంటుంది. అయితే చైనా నేరుగా చేయకుండా తమ మిత్ర దేశాలతో చైనా చేయాలనుకున్న అన్ని రకాల పనులను చేయిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం చైనాకు పాకిస్తాన్ ఒక బానిస దేశంగా కొనసాగుతుంది. ఆర్థిక సహాయం పేరుతో పాకిస్తాన్ తో స్నేహం చేసిన చైనా ఇక క్రమక్రమంగా పాకిస్తాన్ అప్పులు చెల్లించకపోవడంతో చివరికి పాకిస్తాన్ దేశాన్ని తమ బానిస గా మార్చుకుంది. ఈ క్రమంలోనే చైనా చేయాలనుకున్న అన్ని పనులను కూడా పాకిస్థాన్తో చేయిస్తోంది.



 ప్రపంచం దృష్టికి రాకుండా ఉండేందుకు ఎన్నో రకాల కుట్రలు పన్నుతూ ఉంటుంది చైనా. ఇప్పటికే పాక్ లోని సైనిక స్థావరాలలోకి చైనా ప్రవేశించింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక పాకిస్తాన్ లో ఉన్న అన్ని వ్యాపారాలు కూడా చైనా ప్రస్తుతం ప్రవేశించడం  గమనార్హం. ఇక పాకిస్తాన్ లో ఉన్న ఎంతో మంది యువతులను ఎత్తుకెళ్లి చైనీయులు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా చైనా చెప్పుచేతుల్లో ఉన్న పాకిస్థాన్ చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.



అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల లో ఎన్నో వివాదాలు పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోయింది చైనా. ఈ క్రమం లోనే ప్రపంచదేశాల దృష్టిని చైనా అణు వ్యవహారాలపై ఉంది అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రపంచం దృష్టికి తెలియకుండా బానిస దేశంగా కొనసాగుతున్న పాకిస్థాన్లో తమ దేశపు అణు వ్యవహారాలను చైనా నిర్వహిస్తుంది అన్న విషయం బయటపడింది. ఇప్పటికే భారత్ అణు ఆయుధాలను తయారు చేస్తుందని ఆధారాలతో కూడా చూపినప్పటికీ ప్రపంచ దేశాలు అంతగా పట్టించుకోలేదు. మరీ ఇప్పుడు చైనా తీరుపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: