2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. పార్టీ ఇంత ఘోరంగా ఓడి పోవడానికి కారణాలు ఏంటి అన్నది పరిశీలిస్తే చాలా కారణాలు కనిపిస్తాయి. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమని రాష్ట్ర ప్రజలను వేడుకొన్న తీరుకు వారంతా ఫిదా అయిపోయారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే ఏం పోతుంది... కచ్చితంగా ఈసారి జగన్ ముఖ్యమంత్రి ని చేయాలని వారు బలంగా ఫిక్స్ అయ్యి మరి ఓట్లు వేశారు. దీంతో పాటు చంద్రబాబు ప్రభుత్వం పై ఉన్న భారీ వ్యతిరేకత తో పాటు... ఐదేళ్లలో జరిగిన అవినీతి... బాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారన్న‌ ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లడం కూడా తెలుగుదేశం ఓటమికి కారణమైంది.

దీంతో పాటు కొత్త ఓటర్లు యువత కూడా ప్రధానంగా జగన్ వైపే ఉన్నారు. గత 20 సంవత్సరాలలో పుట్ట‌కు వ‌చ్చిన కొత్త యువ‌త అంతా జగన్ వైపు ఆకర్షితులయ్యారు. చంద్రబాబు వయసు పైబడటం ... మరోవైపు లోకేష్ కు యువ ఓటర్లను ఆకర్షించే ఆకర్షణ శక్తి లేకపోవడం కూడా ఈ ఓట్లు జగన్‌కు ప‌డటానికి ప్రధాన కారణం అయింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం యువ ఓట‌ర్ల‌ను ఆకట్టుకుంటున్నారు. లోకేష్‌కు ఈ చరిష్మా లేదు.

ఇక వచ్చే ఎన్నికల నాటికి అయినా ఈ యువ ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు కొంతవరకు మ‌ళ్లించాలి. లేక‌పోతే మరోసారి టీడీపీకి ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు. దీనికి తోడు ఈ ఐదు సంవ‌త్స రాల‌లో కూడా చాలా మంది కొత్త ఓట‌ర్లు పుట్టుకు వ‌చ్చారు. వీరిలో కూడా చాలా మంది జ‌గ‌న్‌, ప‌వ‌న్ వైపే ఉన్నారు. వీరి ని ఆక‌ట్టుకునేందుకు చంద్రబాబు ఏం మ్యాజిక్ చేస్తారో ? చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: