భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఇస్రో చైనా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం పై వివాదలను రగిలించింది. సామాజిక మాద్యమాల్లో ఈ విషయం వైరల్ కావడంలో నెటిజన్లు ఇస్రో చర్యలను నిరశించారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) భారత్ లో విరివిగా అమ్ముడవుతున్న సెల్ ఫోన్ లకంపెనీ ఒప్పో ఇండియా లమ ధ్య ఎం.ఓ.యు కుదిరింది. ఈ విషయం సమాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం దృష్టిలో పడింది.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, చైనా దేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఒప్పో కు చెందన భారత్ విభాగం మధ్య ఒప్పందం వివాదాన్ని రేకెత్తించింది, రాజకీయ నాయకులు నెటిజన్లు ఈ ఒప్పందంపై భారత అంతరిక్ష సంస్థను ప్రశ్నిస్తున్నారు,
తూర్పు లడఖ్‌లో పొరుదుదేశం దురాక్రమణఆ తర్వాత చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. “హలో చైనా. మా ఇస్రోకు మీరంటేచాల్ ప్రేమఅని రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. ఒకవైపు మనం వారిని సరిహద్దుల వద్ద ఎదుర్కోంటున్నాం, వారి మార్గెట్ ను భారత్ లో తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాంటిది మనకు దేేశభద్రత ముఖ్యం అన్న అంశాన్ని ఎలా విస్మరించాం. ఈ విషయం మాకు చాలా విస్మయం కలిగిస్తున్నది అని శివసేన నాయకుడు శివ్ చెపారు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమ్మద్ ఈ పరిణామాన్ని 'షాకింగ్'గా అభివర్ణించారు. ఆమె ట్వీట్ చేసింది: "ఒకవైపు, చైనా చట్టవిరుద్ధంగా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటోంది మరోవైపు, మరోవైపు సాంకేతక కోసం ఇస్రోతో జతకట్టింది. చైనా మొబైల్ తయారీదారు ఒప్పోతో జతకట్టింది!" అని ఆమె పేర్కోన్నారు. చాలా మంది నెటిజన్లు ఇస్రో -ఒప్పో ఇండియా ఒప్పం దాన్ని 'షాకింగ్,' 'బ్లండర్' అంటూ విమర్శలు సంధించారు. మరికొందరు ఇస్రోనే చైనాకు చెందిన కంపేనీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తామెందకు చైనా యాప్ లను బహిష్కరించాలి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు..
ఈ ఒప్పందంపై ఇస్రో ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఒప్పో ఇండియా మాత్రం ఆత్మనిర్భర భారత్ విజన్ మద్దతు నిస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో- ఇండియా పరిశ్రమలకు ఇస్రో సాంకేతికతను అందిస్తుంది. మరింత సహకరిస్తుందని తెలిపింది. వావెల్ సి అప్లికేషన్ ను అందిపుచ్చుకోవండ ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నటట్లు ఆ సంస్థ తెలిపింది. మంచి భవిష్యత్ ను ఏర్పరచుకోవడానికి ఇస్రోతో నూతన ప్రయాణాన్ని ఆరంభించామని ఒప్పో ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం నావెల్ సి సేవలు అందుతాయి. భారత్ లోని ఒప్పో వినియోగదారులకు మొబైల్ హ్యాండ్ సేట్ లలో ఎండ్ -టు-ఎండ్ అప్లికేషన్ లను అనుసంధానిస్తాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి