15 నుండి 18ఏళ్ల మధ్య వయసు టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ శనివారమే ప్రారంభమైంది. ఈ ఏజ్ గ్రూప్ వారికి కొవాగ్జిన్ టీకా వినియోగించుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన వారంతా టీకాలు వేసుకోవాల్సి ఉంది.
ఇక ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వాలు పలు చర్యలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బెంగళూరులో.. ఇక నుంచి క్యాబ్ ప్రయాణానికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే మాల్స్, థియేటర్లలో ప్రవేశానికి వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్ ను తప్పనిసరి చేసింది. ఇదే విధానాన్ని పబ్ లు, బార్ లు, రెస్టారెంట్ లతో పాటు క్యాబ్ లకు కూడా విస్తరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 27వేల 553మంది కరోనా బారిన పడ్డారు. మరో 284మంది మహమ్మారితో మరణించారు. ఇక దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3కోట్ల 48లక్షల 89వేల 132కు చేరింది. ప్రస్తుతం దేశంలో లక్షా 22వేల 801కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 6నెలల్లోనే ఇదే అత్యధికం. రికవరీ రేటు 98.27శాతానికి తగ్గింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 1,525కు చేరుకున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి