
-
anil kumar singhal
-
avanthi srinivas
-
Buggana Rajendranath Reddy
-
CBN
-
Cheque
-
Devineni Uma Maheswara Rao
-
GANTA SRINIVASA RAO
-
Jagan
-
krishna
-
Kurasala Kannababu
-
MEKAPATI GOUTHAM REDDY
-
Minister
-
Nani
-
Nellore
-
Party
-
PUSHPASREEVANI PAMULA
-
Reddy
-
srinivas
-
TDP
-
Telangana Chief Minister
-
Venu Thottempudi
-
Vijayawada
-
WOMEN
-
YCP
అందుకే చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు మినహా అందరు మంత్రులు ఓడిపోయారు. చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు పై విడుదల రజిని - మైలవరంలో దేవినేని ఉమా పై వసంత కృష్ణ ప్రసాద్ ను పోటీ చేయించడం వైసిపి ప్రత్యేక వ్యూహంలో భాగాలు. ఇప్పుడు చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మంత్రులుగా ఉన్న వారిని ఓడించేందుకు తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రుల నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న పార్టీ నేతలను మార్చేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు.
ఇప్పటికే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యర్థులను మార్చేశారు. పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డిని - డోన్‌లో మన్నె సుబ్బారెడ్డిని కొత్త ఇన్చార్జిగా తీసుకువచ్చారు. అలాగే గుడివాడలో మంత్రి కొడాలి నాని , విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యర్థులు కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి పై పోటీ చేసే టిడిపి నాయకులు కూడా మారనున్నారు.
మహిళా మంత్రులైన సుచరిత - పుష్పశ్రీవాణి - తానేటి వనిత ప్రత్యర్థులు కూడా మారనున్నారు. అలాగే అవంతి శ్రీనివాస్ - కురసాల కన్నబాబు - చెల్లుబోయిన వేణు గోపాల్ పై కూడా టిడిపి నుంచి కొత్త అభ్యర్థులు పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మంత్రులను ఓడించేందుకు చంద్రబాబు ప్రత్యేక స్కెచ్‌లు చేస్తున్నారు. ఇవి ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.