కర్నూలు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో మొత్తం నియోజకవర్గాలను వైసీపీ స్వీప్ చేసేసింది. ఇలాంటి జిల్లాలో కొంతకాలంగా పార్టీలోనే గొడవలు మొదలైంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు బాగా పెరిగిపోతుండటంతో పార్టీ రోడ్డుమీద పడుతోంది. విచిత్రమేమిటంటే వ్యక్తిగతంగా తమ ఆధిపత్యం కోసం పార్టీ పరువును కూడా నేతలు రోడ్డున పడేస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక మంత్రిని పంపించి సర్దుబాటు చేయమని పంపారు.




మంత్రి వచ్చారు కాదా పరిస్దితులు సద్దుమణుగుతాయని అనుకుంటే పరిస్ధితి ఇంకా దిగజారిపోయింది. కారణం ఏమిటాని చూస్తే దానికి కారణమే మంత్రంటున్నారు ద్వితీయశ్రేణి నేతలు. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గంలో ఆర్ధర్ ఎంఎల్ఏగా గెలిచారు. అయితే నియోజకవర్గానికి ఇన్చార్జిగా బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి పనిచేస్తున్నారు. నియోజకవర్గానికి ఎంఎల్ఏ లేకపోతే ఇన్చార్జిని నియమిస్తారు.




కానీ ఈ నియోజకవర్గంలో ఎంఎల్ఏ ఉండగా మళ్ళీ ఇన్చార్జిగా బైరెడ్డిని ఎందుకు  నియమించారో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎంఎల్ఏయేమో ఎస్సీ, ఇన్చార్జేమో రెడ్డి. ఆర్ధర్ ఎంఎల్ఏనే అయినా పెత్తనమంతా బైరెడ్డిదే. దాంతో ఇద్దరి మధ్య వివాదాలు మొదలై పెరిగి పెద్దదైపోయింది. ఏ విషయంలో అయినా తన మాటే చెల్లాలని ఇటు ఎంఎల్ఏ అటు ఇన్చార్జి గొడవలు పడుతున్నారు. మామూలుగానే గొడవలువుతుంటే ఇది సరిపోదన్నట్లుగా బైరెడ్డికి శాప్ ఛైర్మన్ పదవి కూడా వచ్చింది. దాంతో ఛైర్మన్ రెచ్చిపోతున్నారు.




ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎంఎల్ఏ+ఇన్చార్జి ఇద్దరు సక్రమంగా ఉంటేనే పార్టీ ఇక్కడ గెలుస్తుంది. లేకపోతే వైసీపీ ఓడిపోవటం ఖాయం. ఈ విషయం తెలిసికూడా గొడవలు పడుతునే ఉన్నారు. వీళ్ళ గొడవలను సర్దుబాటు చేయటానికి వచ్చిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా బైరెడ్డిని సపోర్టు చేస్తున్నారట. దాంతో బైరెడ్డి మరింతగా రెచ్చిపోతున్నారు. దాంతో ఆర్ధర్ ముఖ్యమంత్రికే ఇద్దరిపైనా  ఫిర్యాదు చేశారు. ఇక్కడ బైరెడ్డి మరచిపోయిన విషయం ఏమిటంటే తానెప్పటికీ ఇక్కడ నుండి పోటీ చేయలేరు.




ఆర్ధర్ కాకపోతే మరో ఎస్సీ నేత పోటిచేస్తారు. ఎవరు పోటీచేసినా వాళ్ళను గెలిపించే బాధ్యత బైరెడ్డి లాంటి వాళ్ళదే. ఇపుడు ఆర్ధర్ తో పడనట్లే రేపు మరో ఎస్సీ ఎంఎల్ఏతో కూడా పడకపోతే ఏమి చేస్తారు ? కాబట్టి అనీల్ అయినా జగన్ అయినా ముందు బైరెడ్డికి బుద్ధి చెప్పాలి. ఇన్చార్జి హోదాలోనే నియోజకవర్గంలో పెత్తనం చెలాయించాలని అనుకున్నపుడు మరి ఎంఎల్ఏ ఏమి చేయాలి ? అలాగే బైరెడ్డిలాంటి వాళ్ళ మద్దతులేకుండా ఆర్ధర్ లాంటి వాళ్ళు కూడా గెలవలేరు. కాబట్టి పార్టీ గెలవాలంటే ఇద్దరు సర్దుబాటు చేసుకుని వెళ్ళాలి. లేకపోతే చేతులారా నియోజకవర్గాన్ని కోల్పోవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: