దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు  జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి పోయాయి. ఈ తరుణం లోనే పంజాబ్ లో కూడా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్ని ఎన్నికలను వాయిదా వేయాలని, ఎన్నికల కమిషన్ను కోరారు. దీంతో ఆ కమిషన్ కీలక నిర్ణయం తీసుకొని చెప్పింది. అది ఏంటో తెలుసు కుందామా..?
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో ఫిబ్రవరి 14న జరగాల్సి ఎన్నికలను వాయిదా వేసింది.


 పంజాబ్ లో ఎన్నిక లను ఫిబ్రవరి 20కి మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర సీఎం కాంగ్రెస్ నేత చరన్ జీత్ సింగ్ చన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని దళిత వర్గానికి చెందిన ప్రతి నిధులు కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉత్త రప్రదేశ్లోని బెనారస్ లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు జరగనున్న గురు రవిదాస్ జయంతి వేడుకలకు పంజాబ్ నుంచి దాదాపు 20 లక్షలమంది వెళ్లే అవకాశం ఉందని చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే వారంతా ఓటు హక్కును వినియోగించు కోలేరని, కనీసం ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని ఈసికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్లో గురు రవి దాస్ వేడుకలు ఘనంగా జరుగు తాయి. ఏపీ లో జరిగే ఈ వేడుకలకు సంబంధించి పంజాబ్ నుంచి లక్షల సంఖ్యలో జనం అక్కడికి వెళ్తారు. దాదాపు 20 లక్షల నుంచి పాతిక లక్షల మంది వరకు గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: