రాజకీయాల్లో ఏ నాయకుడుకైన ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడం చాలా గొప్ప అని చెప్పొచ్చు. అసలు ప్రస్తుత పరిస్తితుల్లో ఒక్కసారి గెలిచి, మరొకసారి గెలవడం అనేది బాగా ఇబ్బంది అయిపోతుంది. కానీ కొంతమంది నేతలు ప్రజా మద్ధతు పెంచుకుని వరుసపెట్టి విజయాలు సాధిస్తారు. అలా వరుసపెట్టి విజయాలు అందుకున్న నాయకుల్లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా ఒకరు. ఇక వెలగపూడి అంటే కమ్మ వర్గానికి చెందిన నాయకుడు అని అందరికి అర్ధమైపోతుంది.

పైగా ఈయన విజయవాడకు చెందిన నేత అని అందరికీ తెలుసు. కానీ ఈయన విశాఖకు వెళ్ళిపోయి, అక్కడ చక్రం తిప్పుతున్నారు. గత కొన్నేళ్లుగా విశాఖ నగరంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు అయిపోయారు. అలాగే అక్కడ నుంచి వరుసగా మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇలా హ్యాట్రిక్ కొట్టి బలంగా ఉన్న వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుందో అందరికీ తెలిసిందే.

ఈయనని ఆర్ధికంగా, రాజకీయంగా బలహీనపర్చడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆర్ధికంగా, రాజకీయంగా గట్టిగానే దెబ్బకొట్టారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, వెలగపూడిని గట్టిగానే టార్గెట్ చేశారు. ఆయనని రాజకీయంగా వీక్ చేయడానికి చూశారు. అటు ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టారు. ఈ ప్రభావంతో ఈస్ట్‌లో వెలగపూడి బలం కాస్త తగ్గినట్లైంది.


పైగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో వెలగపూడి..తన నియోజకవర్గం తూర్పు పరిధిలో ఉన్న డివిజన్లలో టీడీపీని గెలిపించలేకపోయారు. దీంతో వెలగపూడి పని అయిపోయిందని ప్రచారం మొదలైంది. ఇదే క్రమంలో నెక్స్ట్ వెలగపూడికి చంద్రబాబు సీటు ఇవ్వరని ప్రచారం వస్తుంది. తూర్పులో వెలగపూడి వీక్ అవ్వడం వల్లే సీటు ఇవ్వరని కథనాలు వస్తున్నాయి. కానీ వెలగపూడిని దాటి చంద్రబాబు వేరే నేతకు సీటు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. మళ్ళీ విశాఖ తూర్పు సీటుని వెలగపూడికే ఫిక్స్ చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: