
వీటిల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీని దక్కించుకుని అధికారం దక్కించుకుంది..2024 పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటడం కమలం పార్టీకి కొత్త ఊపుని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ ఫలితాల స్పూర్తితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కమలదళం దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే...అక్కడ టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుంది.
అయితే గెలవడం విషయం పక్కన పెడితే...ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న గొప్పే అని విశ్లేషకులు అంటున్నారు...బలమైన వైసీపీ, టీడీపీలని దాటి బీజేపీ గెలిచే పని కాదని, ఆఖరికి సోము వీర్రాజు ఎమ్మెల్యేగా నిలబడిన గెలవడం కష్టమని, కాబట్టి ఏపీలో బీజేపీ పగటి కలలు కనడం వేస్ట్ అంటున్నారు.